రోగం నయం చేస్తానని చెప్పి యువతిపై బాబా అత్యాచారం..!

హైదరాబాద్: మాయలు, మంత్రాలతో జబ్బును నయం చేస్తానని చెప్పి ఓ యువతిపై అత్యాచారం చేయబోయిన దొంగ బాబాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్బర్‌హిల్స్‌‌లో చోటు చేసుకుంది.

అక్బర్‌హిల్స్‌కు చెందిన మహ్మద్ సాదిక్ హుస్సేన్(32) మంత్రాల పేరుతో అమాయకులను మోసం చేస్తుంటాడు. అక్టోబర్ 26న టోలిచౌకి ప్రాంతానికి చెందిన ఆయేషా సిద్దిఖీ తన కుమార్తె సాలీయాసుల్తానా(17) ఆరోగ్యం బాగాలేకపోతే ఆమెను హుస్సేన్ వద్దకు తీసుకువెళ్లింది.

Fake Baba rape attempt on Woman in Ranga Reddy district

ఆమెను పరీక్షించిన మహ్మద్ సాదిక్ హుస్సేన్ కూతురు ఆరోగ్యం బాగు చేయాలంటే రూ. 5వేలు అవుతుందని చెప్పడంతో వారు ఆ మొత్తాన్ని తీసుకుని ఆదివారం నాడు హుస్సేన్ దగ్గరకు వెళ్లారు. సాలీయాను హుస్సేన్ తన గదిలోకి తీసుకెళ్లి మాయమాటలు చెప్తూ వెకిలిచేష్టలతో అత్యచారం చేయబోయాడు.

వెంటనే గదిలోంచి బయటకు వచ్చిన సాలీయా జరిగిన అసలు విషయాన్ని తల్లికి చెప్పింది. దాంతో ఈ ఘటనపై ఆయేషా సిద్దిఖీ ఆదివారం సాయంత్రం రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

అనంతరం మహ్మద్‌ సాదిక్ హుస్సేన్‌ను సోమవారం అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. అతనిపై నిర్భయచట్టం, లైంగిక వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+