నగరంలో నకిలీ ఐపీఎస్.. గుట్టురట్టు చేసిన టాస్క్‌ఫోర్స్

హైదరాబాద్‌: నగరంలో నకిలీ ఐపీఎస్‌ అడ్డంగా దొరికిపోయాడు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అడిషనల్ ఎస్పీగా చలామణి అవుతూ పలువురిని బెదిరించాడు. చివరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కడంతో సదరు డూప్లికేట్ ఐపీఎస్ లీలలు బయటపడ్డాయి.

ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన గురు వినోద్ 2017లో సివిల్స్ పరీక్షల కోసం కోచింగ్ తీసుకున్నాడు. ఆ సమయంలో సోషియాలజీ బోధించే రిటైర్డ్ ఆర్మీ మేజర్‌తో పరిచయం ఏర్పడింది. దాంతో అతడికి సన్నిహితంగా మెదులుతూ వచ్చాడు. ఆ క్రమంలో మేజర్ ఇంటి నుంచి నకిలీ తుపాకీ అపహరించాడు.

 fake ips arrested in hyderabad

సివిల్స్‌‌లో విజయం దక్కకపోయేసరికి రాంగ్ రూట్ ఎంచుకున్నాడు. ఐపీఎస్ అధికారి కావాలనే కల నెరవేరకపోవడంతో నకిలీ అవతారమెత్తాడు. ఐడీ కార్డు తయారుచేసుకుని ఐపీఎస్‌గా చలామణి అయ్యాడు. ఆ క్రమంలో కొందరిని బెదిరించడంతో జైలుకు కూడా వెళ్లొచ్చాడు. ఇటీవలే బయటకు వచ్చిన తర్వాత కూడా అదే రీతిలో వ్యవహరించాడు. నకిలీ ఐపీఎస్ గుట్టురట్టు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులను సీపీ అంజనీ కుమార్ అభినందించారు. నిందితుడి నుంచి నకిలీ తుపాకీ, ల్యాప్‌ట్యాప్‌, ఎన్‌ఐఏ సహా వివిధ సంస్థల రబ్బరు స్టాంపులు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+