వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విషాద పర్వం: తెలంగాణలో ఆగని రైతుల ఆత్మహత్యలు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఆదివారం ఒక్కరోజే 13 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న విషాద ఘట్టం చూస్తుండగానే సోమవారం మరో ఐదుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్కరేసి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ముగ్గురు రైతులు సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు.

మెదక్ జిల్లా మెదక్ పట్టణం నర్సిఖేడ్ వీధికి చెందిన చింతల సత్యనారాయణ (45) అనే రైతు అప్పుల బాధలు భరించలేక సోమవారం తెల్లవారు జామున 4 గంటలకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సత్యనారాయణకు రెండెకరాల స్వంత భూమి ఉండగా, కౌలుకు మరో 10 ఎకరాలు సాగు చేస్తూ వస్తున్నా రు. స్వంత భూమి లో సుమారు నాలుగు బోర్లు వేశారు. ఆ బోర్లు ఫెయిల్ అయ్యాయి.

భార్య సిద్దమ్మ పేరుమీద మెదక్ కో ఆపరేటివ్ సొసైటిలో 70 వేలు అప్పు తీసుకున్నారు. అక్కడక్కడా అప్పులు 4 లక్షలపైన ఉన్నాయి, ఈ అప్పులతో పాటు స్వంత భూమి, కౌలుకు తీసుకున్న భూమి కూడా సహకరిం చలేదు. నాటు వేసిన భూములు, తుకాలు ఎండిపో యాయి. స్వంత భూమి బీడుగా మారింది. అప్పులు తడిసిమోపడయ్యాయి. ఫలితంగా పొలంలో ఉన్న చింతచెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Farmer Suicides Cartoon

ఇదిలావుంటే, ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని తడిహత్నూర్ గ్రామానికి చెందిన రాథోడ్ దేవు (57) అనే రైతు సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దేవు తన ఐదుఎకరాల్లో పత్తి సాగు చేయగా, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బతింది. దీంతో పెట్టుబడు లకు చేసిన అప్పులు తీర్చలేననే బెంగతో మనస్తాపానికి గురై సోమవారం ఉదయం పొలం లోనే పురుగుల మందు తాగి మరణించాడు.

Famers suicides continuing in Telangana

మహబూబ్‌నగర్ జిల్లా బల్మూర్ మండల పరిధిలోని చెన్నారం గ్రామానికి చెందిన సంకెళ్ల చిన్నయ్య (60) అనే రైతు సోమవారం అప్పుల బాధతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్నయ్య నాలుగెకరాల పొలంలో రెండు ఎకరాలు మొక్కజొన్న, రెండు ఎకరాలు పత్తిపంటను సాగు చేశాడు. పొలంలో ఐదుబోర్లు వేయగా, ప్రస్తుతం ఒక్క బోరు మాత్రమే పనిచేస్తోంది. బ్యాంక్‌లో రూ.50 వేలు, ప్రైవేట్‌గా ఐదు లక్షల వరకు అప్పు చేశాడు. దాంతో పశువుల దొడ్డిలో చెట్టుకుని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడు మండల పరిధిలోని ఉండవెల్లి గ్రామానికి చెందిన సుధాకర్ (34) సోమవారం మరణించాడు. సుధాకర్ తన నాలుగు ఎకరాల పొలంలో పొగాకు పంటను సాగు చేశాడు. సాగుచేసిన పంటకు తెగుళ్లు సోకడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలని మనస్తాపానికి గురై ఈ నెల 17వ తేదీన సిమెంటు గోలీలను మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డా డు. కర్నూల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు.

మహబూబ్‌నగర్ జిల్లా తలకొండపల్లి మండల పరిధిలోని చౌదర్‌పల్లి గ్రామంలో సప్పడి మాస య్య (40) అనే రైతు పురుగుల మందు తాగి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పంటలు చేతికి రాకపోవడంతో పాటు అప్పులు ఎక్కువ కావడంతో జీవితంపై విరక్తి చెంది సోమవారం ఈ చర్యకు పాల్పడ్డాడు. తనకున్న 14 ఎకరాల పొలంలో నాలుగు ఎకరాలు అమ్మి కొంత అప్పును తీర్చాడు.

కరీంనగర్ జిల్లాలో 20 మందికిపైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా, ఆదివారం మరో ముగ్గురు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు.

English summary
Farmers suicides are continuing Telangana with fresh suicides in Adilabad, Medak and Mahaboobnagar districts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X