Marriage: 60 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకున్న సినీ నటుడు..
పోకిరి సినిమాతో తెలుగు నాట మంచి గుర్తింపు పొందిన నటుడు ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి చేసుకున్నారు. 60 ఏళ్ల వయస్సులో ఆయన ద్వితీయ వివాహం చేసుకున్నారు.
అస్సాంకు చెందిన రూపాలి అనే ఫ్యాషన్ డిజైనర్ ఆశిష్ విద్యార్థి పెళ్లాడారు. వీరి పెళ్లి కోల్ కత్తాలో కుటుంబ సభ్యుల సమక్షంలో సాదాసీదాగా జరిగింది. పెళ్లి కూతురు రూపాలికి సంబంధించి ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. ఆశిష్ విద్యార్థి పాపే నా ప్రాణంతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కానీ పోకిరి సినిమాతో ఫేమస్ అయ్యారు.
ఆశిష్ విద్యార్థి అనేక భాషల్లో నటించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్, ఒడియా, మరాఠీ, బెంగాలీలో 300 సినిమాలు చేశారు. ఆశిష్ విద్యార్థి విలన్ గా, సహా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయనకు గతంలోనే బెంగాల్ కు చెందిన నటి శకుంతల బారువాతో పెళ్లి అయింది. వీరిద్దరికి ఒక కొడుకు ఉన్నాడు. శకుంతలతో ఆశిష్ విద్యార్థి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రూపాలని వివహం చేసుకున్నారు. ఆశిష్ విద్యార్థి కేరళకు చెందిన వ్యక్తి ఆయన
కేరళ లోని తెళ్లిచెర్రిలో 1967-ఫిబ్రవరి-12 న జన్మించారు.

2014 అక్టోబరు 20న ఆశిష్ విద్యార్థికి తృటిలో ప్రమాదం తప్పింది. భిలాయి సమీపంలో బాలీవుడ్ డైరీ చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆశిష్ నదిలో నిలబడి ప్రార్థిస్తున్నట్లుగా నటిస్తున్నారు. ఆ సమయంలో నదిలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. దీంతో ఆశీష్ నీటిలో మునిగిపోతుండగా... అక్కడే ఉన్న పోలీసు కానిస్టేబుల్ వికాస్ సింగ్ వెంటనే అప్రమత్తమై నదిలోకి దూకారు. ఆశిష్ ను రక్షించారు. ఆశిష్ విద్యార్థి తెలుగులో పోకిరి, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, బహుబలి2 వంటి విజయవంతమైన సినిమాల్లో నటించారు.
సినీ ఇండస్ట్రీలో రెండు, మూడు పెళ్లిలు కామన్. చాలా మంది సినీ నటులు రెండు పెళ్లిలు చేసుకున్నారు. నటుడు నరేష్ మొదట సీనియర్ కెమెరామెన్ కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక బాబు జన్మించాడు. తర్వాత మనస్ఫర్ధల కారణంగా వారు విడిపోయారు. తర్వాత రెండో పెళ్లి చేసుకుని విడాకులు కూడా తీసుకున్నారు. ఆ తర్వాత రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె రమ్యను 2010 డిసెంబరు 3న పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కొడుకులు ఉన్నారు. ప్రస్తుతం నరేష్ రమ్యకు దూరంగా ఉంటున్నారు.












Click it and Unblock the Notifications