Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్‌లో ఫ్యాన్సీ నెంబర్ల వేలం: రూ. లక్షలు పోశారు, ఏ నెంబర్ ఎంతకంటే?

హైదరాబాద్: వాహనాల ఫ్యాన్సీ నెంబర్లకు ఎప్పుడూ భారీ డిమాండ్ ఉండనే ఉంటుంది. ఎక్కువగా ప్రముఖులు, సంపన్నులు తమకు కావాల్సిన ఫాన్సీ నెంబర్ కోసం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉంటారు. దీంతోనే ఫాన్సీ నెంబర్లకు ఎప్పుడూ క్రేజ్ కొనసాగుతోంది. తాజాగా, హైదరాబాద్ నగరంలో ఫాన్సీ నెంబర్లకు వేలం నిర్వహించగా.. భారీ ధరలు పలికాయి.

ఫ్యాన్సీ నెంబర్ల ద్వారా తెలంగాణ రవాణా శాఖకు కూడా భారీగా ఆదాయం సమకూరుతోంది. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో మంగళవారం ఒక్కరోజే 53,34,894 రూపాయల ఆదాయం రావడం గమనార్హం. వేలంలో అత్యధికంగా టీఎస్ 09 జీసీ 9999 నెంబర్ రూ. 21,60,000లు పలికింది. అత్యల్పంగా టీఎస్ 09 జీడీ 0027 రూ. 1,04,999కి కొనుగోలు చేశారు.

Fancy numbers auction in Hyderabad: Huge income for transport ministry

TS 09 GC 9999 నెంబర్‌ను రూ. 21,60,000కు ప్రైమ్ సోర్స్ గ్లోబల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది.

TS 09 GD 0009 నెంబర్‌ను రూ. 10,50,000కు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ దక్కించుకుంది.

TS 09 GD 0001 నెంబర్‌ను రూ. 3,01,000కు ఆంధ్రా ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది.

TS 09 GD 0006 నెంబర్‌ను రూ. 1,83,000కు గాయజ్ జ్యువెల్లరీ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది.

TS 09 GD 0019 నెంబర్‌ను రూ. 1,70,100కు సితార ఎంటర్‌టైన్మెంట్ దక్కించుకుంది.

TS 09 GD 0045 నెంబర్ ను రూ. 1,55,000కు సాయి పృథ్వీ ఎంటర్‌ప్రైజెస్ దక్కించుకుంది.

TS 09 GD 0007 నెంబర్ ను రూ. 1,30,000కు ఫైన్ ఎక్స్‌పర్ట్స్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది.

TS 09 GD 0027 నెంబర్ ను రూ. 1,04,999కు శ్రీనివాస కన్‌స్ట్రక్చన్స్ దక్కించుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+