హైదరాబాద్​ లో మెస్సీతో ఫొటో దిగే ఛాన్స్ - ఫీజు, కండీషన్స్, షెడ్యూల్..!!

ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సీ హైదరాబాద్ వస్తున్నారు. మెస్సీ పర్యటన పైన అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు. నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అభిమానుల కోసం మెస్సీతో ఫొటో దిగే అవకాశం కల్పిస్తున్నారు. ఇందు కోసం ద గోట్‌ టూర్‌' నిర్వాహక కమిటీ కీలక అంశాలను వెల్లడించింది. ఫొటో దిగే వారు చెల్లించాల్సిన రుసుము.. షరతులను వివరించారు. దీంతో, ఏ స్థాయిలో స్పందన వస్తుందనేది ఆసక్తిగా మారుతోంది.

ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సీ (అర్జెంటీనా) హైదరాబాద్ పర్యటనకు భారీగా ఏర్పాట్లు చేస్తు న్నారు. 13వ తేదీన హైదరాబాద్ కు వస్తున్న వేళ అభిమానులు ప్రత్యేకంగా ఫొటోలు తీసుకునే అవకాశం కల్పించారు. లియోనెల్‌ మెస్సీతో ఒక్క ఫొటోకు రూ.10 లక్షలు చెల్లించాల్సి ఉంటుం దని 'ద గోట్‌ టూర్‌' నిర్వాహక కమిటీ (హైదరాబాద్‌) సలహాదారు పార్వతి రెడ్డి ప్రకటించారు. కాగా,100 మందికి మాత్రమే ఫొటోలు తీసుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేసారు.

Fans can Book spot at the exclusive photo opportunity with Lionel Messi in Hyderabad on 13th

ఈ నెల 13న సాయంత్రం లియోనెల్‌ మెస్సీ హైదరాబాద్‌లో అడుగుపెడతారని పార్వతి రెడ్డి తెలిపారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగే 'మెస్సీతో మీట్‌ అండ్‌ గ్రీట్‌' కార్యక్రమంలో ఆయనతో ఫొటోలు దిగొచ్చని అన్నారు. ఒక్కో ఫొటోకు రూ.9.95 లక్షలు (జీఎస్టీ అదనం) చెల్లించాల్సి ఉంటుందని, డిస్ట్రిక్ట్‌ యాప్‌లో ఆ టికెట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

ఇక..శనివారం సాయంత్రం 4 గంటలకు మెస్సీ హైదరాబాద్‌ నగరానికి చేరుకుంటారని పార్వతి రెడ్డి తెలిపారు. రాత్రి 7 గంటలకు ఉప్పల్‌ స్టేడియానికి చేరుకుంటారని, మెస్సీతో పాటు రోడ్రిగో డి పాల్‌ (అర్జెంటీనా), లూయిస్‌ సువారెజ్‌ (ఉరుగ్వే) స్టేడియంలో సందడి చేస్తారని, ఇందులో భాగంగా సింగరేణి ఆర్‌ఆర్‌-9తో, అపర్ణ మెస్సీ ఆల్‌ స్టార్స్‌ జట్టు 20 నిమిషాల పాటు ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ ఆడుతుందని తెలిపారు. 15 మంది చిన్నారులు మ్యాచ్‌లో పాల్గొంటారని, అందులో ఐదుగురు ట్రైనింగ్​ పొందిన వారని, మిగతా 10 మంది ప్రతిభ ఉండి ట్రైనింగ్​కు దూరమైన (అండర్‌ ప్రివిలేజ్డ్‌) పిల్లలని వెల్లడించారు.

Fans can Book spot at the exclusive photo opportunity with Lionel Messi in Hyderabad on 13th

ఇక.. చివరి ఐదు నిమిషాలు సీఎం రేవంత్‌రెడ్డి మ్యాచ్‌లో బరిలో దిగుతారని, అనంతరం ఫుట్‌బాల్‌ క్లినిక్‌ ఉంటుందని, ఇందులో భాగంగా యునిసెఫ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ మెస్సీ చిన్నారులకు ఫుట్‌బాల్‌ ఎలా నేర్చుకోవాలి..ఎలా ఆడాలి..అనే చిట్కాలు చెబుతారని పేర్కొన్నారు. మెస్సీ సమక్షంలో పెనాల్టీ షూటౌట్‌ నిర్వహిస్తారని, తరువాత విజేతలకు మెస్సీ బహుమతులు అందజేస్తారని, అనంతరం జరిగే పరేడ్‌లో రేవంత్‌ రెడ్డి మెస్సీని సన్మానిస్తారని వివరించారు.

దాదాపు గంట పాటు ఉప్పల్‌ స్టేడియంలో మెస్సీ ఉంటారని, రాత్రికి హైదరాబాద్‌లోనే బస చేసి ఆదివారం ఉదయం ముంబయికి వెళ్తారని వివరించారు.డిస్ట్రిక్ట్‌ యాప్‌లో అన్ని రకాల టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయని పార్వతి రెడ్డి తెలిపారు. మెస్సీ వచ్చే స్టేడియంలోకి వచ్చే ముందు 2 గంటల పాటు సంగీత విభావరి​ ఏర్పాటు చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+