Tomato Price: కిలో రూ.100 పలుకుతున్న టమాటా.. రైతులకు కాసుల పంట..!
టమాటా ధర పెరుగుతోనే ఉంది. ప్రస్తుతం హోల్ మార్కెట్ లో కిలో టమాటా రూ.60 నుంచి రూ.70 పలుకుతుండగా.. రిటైల్ రూ. 90 నుంచి రూ.100 పలుకుతోంది. ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. నెలన్నర క్రితం వరకు కిలో రూ.30 నుంచి రూ.40 ఉన్న టమాటా భారీగా పెరగడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. టమాటా ధరలు పెరగడానికి దిగుబడి తగ్గడమే కారణమని చెబుతున్నారు. సాధారణంగా ఈ సమయంలో ధర తక్కువ ఉండాలని చెబుతున్నారు.
అయితే సెప్టెంబర్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో భారీ వర్షాలు కురిశాయి. దీంతో టమాటా పంట భారీగా దెబ్బతిన్నట్లు రైతులు చెబుతున్నారు. ఆ తర్వాత పంట వచ్చినా క్వాలిటీ పంట రావడం లేదని చెబుతున్నారు. తాజాగా కొత్త పంట రావడంతో ధర భారీ పలుకుతుందని చెబుతున్నారు. టమాటా బాక్స్ కు రూ.1600 నుంచి రూ.1800 పలుకుతుందని.. ఈ ధర కొద్ది రోజులు ఉంటే తమకు గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు.

టమాటా ధర కిలో రూ.200 పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వ్యాపారులు చెబుతున్నారు. టమాటా కొరత ఉందని.. డిమాండ్ సరిపడ పంట రాకపోవడంతో ధరలు పెరుగుతున్నట్లు చెప్పారు. నెల వరకు ఇవే ధరలు ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. నెల తర్వాత కొత్తగా వేసిన పంట వస్తే ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వివరిస్తున్నారు. టమాటా ధరలే కాకుండా మిగిలిన కూరగాయల ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇక ఉల్లి ధర కూడా ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం కిలో ఉల్లి రూ.50 నుంచి రూ.60 పలుకుతోంది.
కేంద్ర ప్రభుత్వం నాఫేడ్ ద్వార్ ఉల్లిని విక్రయిస్తోంది. కిలో రూ.35 అమ్ముతోంది. ఇక వెల్లుల్లి ధరలు అయితే మండి పోతున్నాయి. వెల్లుల్లి కిలో రూ.500 వరకు ఉంది. నాన్ వెజ్ ధరలు కూడా భారీగానే ఉన్నాయి. మటన్ కిలో రూ.1000 నుంచి రూ.1200 వరకు ఉంది. చికెన్ స్కిన్ లేస్ కిలో రూ.250 నుంచి రూ.280 వరకు ఉంది. కోడి గుడ్డు ఒక్కోటి రూ. 6 పలుకుతోంది. పప్పుల ధరలు కూడా భారీగానే ఉన్నాయి












Click it and Unblock the Notifications