15 నుంచి వార్షిక టోల్‌పాస్ అమల్లోకి - ఈ మార్గాల్లోనే, మార్గదర్శకాలు..!!
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వార్షిక టోల్‌పాస్ ఆగస్టు 15 నుంచి అమల్లోకి రానుంది. కొత్త ధరల ను ఖరారు చేసింది. జాతీయ రహదారుల పై సులభంగా.. చవకగా ప్రయాణం చేసేందుకు వీలుగా ఈ విధానం అమల్లోకి తెచ్చారు. అయితే, ఈ విధానం ఏ టోల్ ప్లాజాల్లో ఈ పాస్ వర్తిస్తుందనేది పలువురికి సందేహంగా మారుతోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఎన్‌హెచ్‌ఏఐ తమ అధికారిక వెబ్ సైట్ లో వెల్లడించింది.
కొత్త విధానం
ఈ నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త విధానం ద్వారా రూ.3,000 చెల్లిస్తే మీ ఫాస్టాగ్‌కు 200 టోల్ క్రెడిట్స్ లేదా సంవత్సరానికి వ్యాలిడిటీ లింక్ అవుతుంది. ఈ పరిమితి పూర్తైన తరువాత మీ ఫాస్టాగ్ మళ్లీ పే-పర్-యూజ్ విధానంలోకి మారుతుంది. దీనికి కొత్త ఫాస్టాగ్‌ను కొనాల్సిన అవసరం లేదు. పాత దాని మీదనే అమలు అవుతుంది. వార్షిక టోల్‌పాస్‌తో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి మేలు జరగనుంది. ప్రస్తుతం ఈ హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిలో ఎన్‌హెచ్‌ఏఐ పరిధిలోని పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్‌ప్లాజాలు కలిపితే ఒకవైపు ప్రయాణానికే రూ.305 టోల్ చెల్లించాల్సి వస్తోంది. వార్షిక పాస్ తీసుకుంటే రూ.45 మాత్రమే ఖర్చు అవుతుంది.

తాజా నిర్ణయంతో
కేంద్రం తీసుకొచ్చిన ఈ నిర్ణయంతో తక్కువ ఖర్చుతో రాకపోకలు సాగించడానికి వార్షిక టోల్‌పాస్ ఉపయోగపడుతుంది. కొత్త పాస్‌ల యాక్టివేషన్, రెన్యువల్ కోసం ఎన్‌హెచ్‌ఏఐ, రాజ్‌మార్గ్‌యాత్ర యాప్, ఎంవోఆర్‌టీహెచ్ వెబ్‌సైట్లలో ప్రత్యేక లింక్‌లను త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఒక్కో టోల్‌గేట్‌వద్ద రూ.50 నుంచి రూ.100కుపైగా టోల్ ఫీజు వసూలు చేస్తుండగా.. వార్షిక పాస్‌తో ఒక్కో టోల్‌గేట్ దాటడానికి సగటున రూ.15 ఖర్చు అవుతుంది. రాష్ట్ర రహదారులకు ఇది వర్తించదు. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల పరిధిలోకి వచ్చే ఎక్స్‌ప్రెస్‌వేలు, స్టేట్ హైవేల్లో ఈ వార్షిక ఫాస్టాగ్ సాధారణ ఫాస్టాగ్‌లా పని చేస్తుంది. ఆ ప్లాజాలో వసూలు చేసే సాధారణ మొత్తాన్ని అక్కడ చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేసారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications