భార్య పక్కింట్లోనే మరో మహిళతో భర్త: తండ్రి కావాలంటూ పిల్లల ధర్నా
కరీంనగర్: ఓ మహిళను వివాహం చేసుకుని, పిల్లలైన తర్వాత మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడో ప్రబుద్ధుడు. దీంతో తమ తండ్రి తమకు కావాలంటూ అతని పిల్లలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కనకయ్య అనే వ్యక్తి కరీంనగర్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ మానకొండూరులో నివాసం ఉంటున్నాడు. కనకయ్యకు భార్య శారద, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి మధ్య విబేధాలు రావడంతో ఒకే చోట పక్క పక్క ఇళ్లల్లో ఉంటున్నారు.

ఈ క్రమంలో కనకయ్య.. అనురాధ అనే మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. దీంతో శారద, ఆమె పిల్లలు ఇద్దరు సోమవారం మహిళా సంఘాల వారి సాయంతో కనకయ్య ఇంటి ముందు ఆందోళనకు దిగారు. 'మా డాడీ మాకు కావాలి' అంటూ కనకయ్య పిల్లలు ప్లకార్డులను చేత్తో పట్టుకుని నిరసన తెలిపారు.
'అక్రమ సంబంధాన్ని అరికట్టాలి, భార్య ఉండగా మరో స్త్రీ ఎందుకు?' అనే నినాదాలు రాసి ఉన్న ఫ్లకార్డులను పట్టుకుని కొందరు మహిళలు వారి ధర్నాకు మద్దతు పలికారు. ఆ తర్వాత ఆగ్రహంతో ఇంటి లోపల ఉన్న అనురాధను బయటకు తీసుకొచ్చి దాడి చేసి చితకబాదారు.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని.. చట్ట ప్రకారం నడచుకోవాలని, ఇలా దాడి చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాలని మహిళలు కోరారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications