వీడు తండ్రేనా: ఏడాదిగా రేప్ చేసి కూతురిని గర్భవతిని చేశాడు
హైదరాబాద్: కన్న కూతురిపై లైంగికదాడికి పాల్పడి గర్భవతిని చేసిన తండ్రిని హైదరాబాదులోని పాతబస్తీలో గల పహాడిషరీఫ్ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇన్‌స్పెక్టర్ చలపతి వివరాలు వెల్లడించారు.
ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి పదేళ్ల క్రితం కుటుంబంతో నగరానికి వచ్చి ఓ కాలనీలో నివసిస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. భార్యాభర్తలిద్దరూ కూతురుతో సహా ఓ పరిశ్రమలో కూలీలుగా పనిచేస్తున్నారు.

అతడు ఏడాది నుంచి కూతురిపై అత్యాచారం చేస్తున్నాడు. ఈ విషయం భార్యకు తెలిసినా బయట పెట్టలేదు. ఎవరికైనా చెబితే కుటుంబం మొత్తాన్ని అంతమొందిస్తానని బెదిరిస్తున్నాడు.
బాలిక గర్భం దాల్చటంతొ గుర్తించిన ఇంటి యజమాని, ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమా చారం ఇచ్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దాంతో అతను నేరాన్ని అంగీకరించాడు. గురువారం అతడిని రిమాండ్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications