నాన్నే నా హీరో: రెబల్ స్టార్ కృష్ణం రాజు (ఫోటోలు)
హైదరాబాద్: 'నాన్నే నా హీరో' అని అన్నారు రెబల్ స్టార్ కృష్ణం రాజు. కపిల్ మహర్షి రీసెర్చ్ ఫర్ రిసోర్సెస్ (కేఎంఆర్ఆర్) ఆధ్వర్యంలో ఆదివారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణంరాజు 'సినీ నటుడుగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లో... సినిమాలు ఎందుకండీ... మీ వాడు చేతికొస్తాడా.. చెడిపోతాడు' అని తెలిసిన వారెందరో నాన్నతో చెప్పేవారు.
'వాడు నా కొడుకు వాడిలో నా రక్తం ప్రవహిస్తోంది.. వాడు తప్పు చేయడు' అని నా మీదున్న అపారమైన నమ్మకంతో తన తండ్రి సమాధానం ఇచ్చేవారని రెబర్ స్టార్ కృష్ణంరాజు అన్నారు.

నాన్నే నా హీరో: రెబల్ స్టార్ కృష్ణం రాజు
'నాన్నే నా హీరో' అని అన్నారు రెబల్ స్టార్ కృష్ణం రాజు. కపిల్ మహర్షి రీసెర్చ్ ఫర్ రిసోర్సెస్ (కేఎంఆర్ఆర్) ఆధ్వర్యంలో ఆదివారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు.

నాన్నే నా హీరో: రెబల్ స్టార్ కృష్ణం రాజు
మూడున్నర దశాబ్దాలుగా యోగ చేస్తున్నానని చెప్పారు. సినిమాల్లో తొలి అడుగులు వేస్తున్నప్పడు ప్రోత్సహించిన మా నాన్నే నా హీరో అని చెప్పారు. ఇక కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి మాట్లాడుతూ యోగ ద్వారా మైగ్రేన్ వ్యాధిని జయించానని అన్నారు.

నాన్నే నా హీరో: రెబల్ స్టార్ కృష్ణం రాజు
అనంతరం పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ పి. సుదర్శన్ రెడ్డి, శాంతా బయోటెక్ అధినేత డాక్టర్ కెఐ. వరప్రసాద్ రెడ్డి, ఆధ్యాత్మికవేత్త జి.సత్యవాణి, సైకాలజిస్ట్‌లు జి. పద్మజ తదితరులు హాజరయ్యారు.

నాన్నే నా హీరో: రెబల్ స్టార్ కృష్ణం రాజు
ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణంరాజు దంపతులు కేఎంఆర్ఆర్ సంచికను విడుదల చేశారు. అనంతరం కృష్ణంరాజు దంపతులను కేఎంఆర్ఆర్ సభ్యులు సన్మానించారు.












Click it and Unblock the Notifications