గీసుకొండలో మహిళా అఘోరీ హల్చల్.. ఏం చేసిందంటే?
గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో సంచరిస్తూ తన చేష్టలతో ఓ మహిళా అఘోరీ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా, ఆమె వరంగల్ జిల్లాలో హల్చల్ చేశారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని శ్రీ కొమ్మాల లక్షీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకునేందుకు వచ్చారు.
ఈ క్రమంలో ఆమెను చూడడానికి స్థానికులు అక్కడికి గుంపులుగా చేరుకున్నారు. ఓ సందర్భంలో వారందరినీ చూసి అఘోరి వారిపై అసహనం వ్యక్తం చేశారు. అందులో ఓ వృద్ధుడు ఆమెతో కాసేపు వాధించారు. అఘోరీ అంటూ అందరినీ మోసం చేస్తున్నావంటూ స్థానికులు అరిచారు.

144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభ మేళాకు వెళ్లకుండా ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని ఆమెను ప్రశ్నించారు. సాధువులు, నాగ సాధువులు అందరూ అక్కడికి వెళ్తుంటే.. నువ్వు వెళ్లలేదా? అని నిలదీశారు. దీంతో ఆగ్రహానికి గురైన అఘోరీ కారు అద్దాలు పగులకొట్టడానికి వెళ్లింది. ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వృద్ధుడిని కొట్టడానికి సిద్ధిమైంది.
అయితే, స్థానికులు ఒక్కసారిగా కేకలు వేశారు. అందరూ ఆమెను నకిలీ అఘోరి అంటూ గట్టిగా అరిచారు. దీంతో పెట్రోల్ క్యాన్ తీసుకొచ్చి హల్చల్ చేసింది ఆ మహిళా అఘోరీ. తానూ మనిషినేనని, తనను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించింది.
పెట్రోల్ క్యాన్‌తో హల్చల్ చేసిన అఘోరీ
— VAVILALA RAJASHEKHARA SHARMA (@VRajeshekar) January 31, 2025
వరంగల్ జిల్లాలో అఘోరీ హాల్చల్ చేసింది.కొమ్మాల గ్రామ సమీపంలో ప్రత్యక్షమైన అఘోరీని కుంభమేళాకు ఎందుకువెళ్లలేదని స్ధానికులు ప్రశ్నించారు.దీంతొ స్థానికులపై అఘోరీ దురుసుగా ప్రవర్తించింది. పెట్రోల్ క్యాన్‌తో అఘోరీ హల్చల్ చేసింది. pic.twitter.com/QY51k33rW8
ఒక వ్యక్తి సెల్ఫీ కోసం ప్రయత్నించగా.. అతని ఫోన్ లాక్కొని కింద పడేసింది. గుడికి వచ్చిన తనతో సెల్ఫీ ఏంటని అతడిపై చేయి చేసుకుంది. ఆ తర్వాత ఆమె దగ్గరికి వచ్చిన కొందరితో మాట్లాడింది. 'మనం అందరం బాధలో ఉన్నాం, భగవంతుడు చల్లగా చూడాలి' అని వ్యాఖ్యానించింది. అనంతరం ఆ మహిళా అఘోరీ కారులో అక్కడి నుంచి వెళ్లిపోయింది. గతంలో కూడా ఆమె పర్యటనల్లో పలు వివాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications