డీఎస్పీగా మహిళా బాక్సర్ నిఖత్ జరీన్
మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (స్పెషల్ పోలీస్)గా జాయినింగ్ రిపోర్ట్ ను బుధవారం నాడు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్‌కు అందజేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ జరీన్ బాక్సింగ్ క్రీడలో రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ గానూ, కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్‌ను ,ఏషియన్ గేమ్స్‌లో బ్రాంజ్ మెడల్‌ను గెలుచుకున్న విషయం విధితమే.
వీటితోపాటు ఇటీవల ప్యారిస్ లో ముగిసిన ఒలంపిక్స్ క్రీడలలో జరీన్ పాల్గొన్నారు. ఇటీవల నిఖత్ జరీన్‌ను డీఎస్పీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో, డీఎస్పీ (స్పెషల్ పోలీస్)గా జాయినింగ్ రిపోర్టు ను బుధవారం నాడు ఆమె డీజీపీకి అందజేశారు.

'మేము రెండుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్, ఒలింపిక్ అథ్లెట్ నిఖాత్_జరీన్‌ను గర్వంగా స్వాగతిస్తున్నాము. ఆమె డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (స్పెషల్ పోలీస్)గా తన కొత్త పాత్రను చేపట్టారు. నిజామాబాద్‌కు చెందిన ఆమె ఈరోజు తన జాయినింగ్ రిపోర్టును నాకు సమర్పించారు. ఆమె అద్భుతమైన విజయాలు తెలంగాణకు స్ఫూర్తినిస్తాయి. రాష్ట్రానికి ఆమె నిరంతర సేవ కోసం మేము ఎదురుచూస్తున్నాము' అని డీజీపీ జితేందర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
బాక్సర్ నిఖత్ జరీన్‌కు డీఎస్పీ ఉద్యోగం
— Congress for Telangana (@Congress4TS) September 18, 2024
🔸డీజీపీ జితేందర్ చేతుల మీదుగా డీఎస్పీగా నియామక పత్రం అందుకున్న నిఖత్
🔸మూడేళ్ల పాటు ప్రొబెషనరీ ట్రైనింగ్
• @revanth_anumula
• @nikhat_zareen pic.twitter.com/0C6P4x9Sr0
కాగా, నిఖ్ జరీన్ తోపాటు క్రీడాకారులు ఈషా సింగ్, భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్ లకు 600 గజాల ఇంటి స్థలం కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక, నిఖత్ జరీన్, సిరాజ్ లకు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలిస్తూ సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
We proudly welcome two-time world boxing champion and Olympic athlete, @nikhat_zareen, as she takes on her new role as Deputy Superintendent of Police (Special Police). Hailing from Nizamabad, she submitted her joining report to me today. Her remarkable achievements inspire… pic.twitter.com/3cmOczmcQW
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) September 18, 2024
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే












Click it and Unblock the Notifications