ఆడ పోలీసులు దారుణంగా ప్రవర్తించారు.!ఆడఈడ నొక్కే ప్రయత్నం చేసారు.!అందుకే తోసానన్న షర్మిళ.!
హైదరాబాద్ : పోలీసులకు ఒక మహిళను అరెస్ట్ చేయడానికి, అడ్డుకోవడానికి వస్తున్నప్పుడు మహిళా పోలీసులను తీసుకురావాలన్న ఇంగితం లేదా తెలంగాణ పోలీసులను వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి, వైయస్ షర్మిల సూటిగా ప్రశ్నించారు. తనను అడ్డుకోవడానికి వచ్చిన పోలీసులు తన దగ్గరికొచ్చి కళ్లు పెద్దవి చేస్తూ తనను బెదిరించే ధోరణిలో మాట్లాడారని, మహిళా పోలీసులు మీద పడుతూ దాడి చేస్తున్నారని, అకారణంగా తోసేస్తున్నారని, మహిళా పోలీసులు సైతం మహిళ అని చూడకుండా నీచంగా వ్యవహరించారని వైయస్ షర్మిళ ఆగ్రహం వ్యక్తం చేసారు. చంచల్ గూడ జైలు నుండి విడుదలైన షర్మిళ మీడియాతో మాట్లాడారు.
చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన షర్మిళ..
బోనులో పెట్టినా పులి పులే నని, తగ్గేది కాదు రాజశేఖర్ రెడ్డి బిడ్డ అని, పోలీసులు, ఎస్సైలు, సీఐలు బెదిరిస్తూ పైపైకి వస్తూ వెనక్కి నెట్టే ప్రయత్నం చేశారని, నేను ఏం చేసినా పోలీసులు చేసిన దాడికి ఆత్మరక్ష కోసమే చేశానని షర్మిళ అన్నారు. అసలు పోలీసులు ఏ అధికారం ఉందని తనను హౌజ్ అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. తన ఇంటి వద్ద పోలీసులు ఉండటానికి వీల్లేదని, బారికేడ్లు పెట్టకూడదని జడ్జి గారు ఆర్డర్ ఇచ్చినా పోలీసులకు తన ఇంటి వద్ద, పార్టీ కార్యాలయం వద్ద భారీగా మొహరించడం ఎంతవరకు సమంజసమని షర్మిళ అన్నారు.

బంతిని ఎంత బలంగా కొడితే అంత బలంగా వెనక్కు వస్తుంది..
తనపై దాడి చేసిన పోలీసులు మళ్లీ తనపై దాడి చేస్తారేమోనన్న భయంతోనే తన ఆత్మరక్షణ కోసం అలా పోలీసుల పట్ల వ్యవహరించానని షర్మిళ వివరణ ఇచ్చారు. పోలీసులు బయట పెట్టిన వీడియోల్లో నన్ను బెదిరించిన వీడియో బయటపెట్టకుండా డ్రామా క్రియేట్ చేసారన్నారు. పోలీసులు వాళ్లకు కావాల్సిన వీడియోలు మాత్రమే తీసుకొని సోషల్ మీడియాలో వైరల్ చేయించారని, తనకు జరిగిన అన్యాయాన్ని, తనపై జరిగిన దాడిని ఎక్కడా బయటపెట్టకుండా చేశారని అన్నారు. పోలీసులు సీఎం చంద్రశేఖర్ రావు తొత్తులు కాదా అని ప్రశ్నించారు.
ఇష్టా రాజ్యంగా కేసీఆర్ పాలన..
వైయస్ విజయమ్మ వయసులో పెద్ద అని, మహిళ అని ఇంగితం లేకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారని షర్మిళ మండిపడ్డారు. బూటు కాలుతో తొక్కడం, చుట్టూ చేరి చేతులు పట్టుకొని ఇబ్బంది పెట్టారని అన్నారు. గతంలో హరీష్ రావు పోలీసును ఇష్టం వచ్చినట్లు కొట్టారని, కేటీఆర్ పోలీసులను బూతులు తిట్టారని, వాళ్లు పోలీసులను, అధికారులను ఇష్టం వచ్చినట్లు తిట్టొచ్చు, కొట్టొచ్చు మహిళలపై దాడి చేస్తే ఏం అనకూడదా? ఏం చేసినా వీళ్లపై కేసులు పెట్టరు, జైల్లో పెట్టరు.. వీళ్లు రాజ్యాలు ఏలాలి.. అక్రమాలు చేసి డబ్బులు సంపాదించుకోవాలా అని ప్రశ్నించారు షర్మిళ.

ఉడత బెదిరింపులకు భయపడేది లేదు..
రాజశేఖర్ రెడ్డి బిడ్డ పోలీసుల తాటాకు చప్పుళ్లకు భయపడదని, ఎంత తొక్కాలని ప్రయత్నిస్తే అంతకంటే ఎక్కువ రోషంతో తెలంగాణ ప్రజల కోసం నిలబడతానని షర్మిళ తెలిపారు. రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన తీసుకొస్తుందని, సీఎం చంద్రశేఖర్ రావు రాజశేఖర్ రెడ్డి భార్యను అవమానించాడని, రాజశేఖర్ రెడ్డి బిడ్డను కూడా జైల్లో పెట్టాడని ఇందుకు చంద్రవేఖర్ రావు ఇంతకు ఇంత అనుభవిస్తాడని షర్మిళ ఆగ్రహం వ్యక్తం చేసారు. రేపు ఇందిరా పార్క్ వద్ద టీసేవ్ ఆధ్వర్యంలో దీక్ష చేయబోతున్నామని షర్మిళ స్పష్టం చేసారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications