Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఐ బాగోతం: నా భార్యను క్షమించి తప్పు చేశా, 2016 నుంచే: ఏఎస్పీ భర్త సంచలనం

హైదరాబాద్: ఏసీబీ ఏఎస్పీపై భర్త సురేందర్ రెడ్డి మంగళవారం సంచలన ఆరోపణలు చేశారు. తన భార్యతో సీఐకి 2016 నుంచి సంబంధం ఉందని చెప్పారు. పెద్దల సమక్షంలో రాజీకి వచ్చినా తన భార్య తనను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యను క్షమించడమే తాను చేసిన నేరం అన్నారు.

ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. అంతకుముందు తమ మధ్య గొడవ ఉన్నప్పటికీ తాము రాజీకి వచ్చామని, కానీ తన భార్య తనను మళ్లీ మోసం చేసిందని వాపోయారు. మరోవైపు, ఏసీబీ ఏఎస్పీ, సీఐ కేసులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.

Recommended Video

    రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన పోలీస్ జంట.. చెప్పులతో కొట్టారు..!

     నలుగురి స్టేట్‌మెంట్ రికార్డ్

    నలుగురి స్టేట్‌మెంట్ రికార్డ్

    ఈ కేసుకు సంబంధించి నలుగురి స్టేట్‌మెంటును రికార్డ్ చేశారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అలాగే నెల రోజులుగా వారిద్దరు మాట్లాడుకున్నారా, ఎన్నిసార్లు మాట్లాడుకున్నారని తెలుసుకునేందుకు వారిద్దరి ఫోన్ కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలో ఇద్దరు కెమెరాకు చిక్కిన విషయం తెలిసిందే.

     డీజీపీకి నివేదిక!

    డీజీపీకి నివేదిక!

    రాసలీలల వ్యవహారంపై ఏసీబీ ఎస్పీ ఇంటికి కేపీహెచ్‌బీ పోలీసులు మంగళవారం వెళ్లారు. ఆమె స్టేట్‌మెంటును రికార్డ్ చేశారు. ఆ తర్వాత సీఐని ప్రశ్నించారు. దీనిపై ఐజీ స్టీఫెన్ రవీంద్ర.. డీజీపీకి నివేదిక ఇవ్వనున్నారు. కాగా, పోలీసు శాఖలో మరోసారి అనైతిక వ్యవహారం రచ్చకెక్కిన విషయం తెలిసిందే. గతంలో ఆబిడ్స్‌లోని ఓ హోటల్లో ఇన్స్‌పెక్టర్, మహిళా ఎస్సై ఒకే గదిలో ఉండగా ఆమె భర్త పట్టుకున్నారు. ఇప్పుడు హైదరాబాదులో మరో సీఐ బాగోతం వెలుగు చూడటం కలకలం రేపుతోంది.

     ఆమె 2007 గ్రూప్ 1 అధికారిణి

    ఆమె 2007 గ్రూప్ 1 అధికారిణి

    ఓ ఇన్స్‌పెక్టర్.. అర్ధరాత్రి ఓ మహిళా ఏఎస్పీ ఇంట్లో నుంచి వస్తుండగా ఆమె భర్త మాటువేసి పట్టుకున్న విషయం తెలిసిందే. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇది జరిగింది. ఏసీబీలో అదనపు ఎస్పీ హోదాలో పని చేస్తున్న మహిళా అధికారి 2007లో గ్రూప్ 1 అధికారిగా పోలీస్ శాఖలో చేరారు. 2010లో ఆమెకు సురేందర్ రెడ్డితో పెళ్లయింది.

     పాత సంబంధాలు కొనసాగిస్తోందని

    పాత సంబంధాలు కొనసాగిస్తోందని

    ప్రస్తుతం భార్యాభర్తలు హైదరాబాద్ కేపీహెచ్‌బీలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నారు. ఇటీవల తన భార్య ఫోన్లో అనుమానాస్పద మెసేజ్‌లు గమనించిన భర్త సురేందర్ రెడ్డి ఆమెను అనుమానించాడు. సీఐ ఆ సందేశాలు పంపించాడు. గతంలోను ఇదే సీఐ విషయంలో వారికి విభేదాలు వచ్చాయి. ఈ సందేశాల నేపథ్యంలో పాత సంబంధాలు కొనసాగుతున్నాయని నిర్ధారణకు వచ్చాడు.

    ఆ అధికారిణి తల్లి కూడా చెప్పుతో కొట్టారు

    ఆ అధికారిణి తల్లి కూడా చెప్పుతో కొట్టారు

    సురేందర్ రెడ్డి వారి కదలికలపై నిఘా వేశాడు. సురేందర్ రెడ్డి సాఫ్టువేర్ ఎగుమతుల వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపారరీత్యా లండన్ వెళ్లి రెండు రోజుల క్రితం తిరిగి వచ్చినా ఆ విషయాన్ని భార్యకు తెలియనివ్వలేదు. అదే సమయంలో సీఐ ఉప్పల్‌లోని ఆయన ఇంటికి కాకుండా, తన ఇంటికి వచ్చినట్లు గుర్తించాడు. తన అమ్మ, అత్త (ఏఎస్పీ తల్లి)తో కలిసి అపార్టుమెంట్ వద్ద మాటు వేశాడు. రాత్రి రెండు గంటలకు సీఐ ప్లాట్ నుంచి బయటకు వస్తుండగా పట్టుకున్నాడు. సీఐ అతనిని నెట్టివేస్తూ పరుగెత్తే ప్రయత్నం చేశాడు. కానీ అత్త, తల్లి అతనిపై దాడికి దిగారు. వెంటపడి మరీ చెప్పులతో కొట్టారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+