Fengal cylone: తెలంగాణలోని ఈ జిల్లాలకు వర్షాల అలర్ట్

ఫెంగల్ తుఫాను ప్రభావం తెలంగాణ రాష్ట్రంపైనా పడింది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఫెంగల్ తుఫానుగా మారి మరికొన్ని గంటల్లో తీరం దాటనుంది. తమిళనాడు, పుదుచ్చేరి వైపు బలంగా దూసుకొస్తున్న ఫెంగల్ తుపాను కారణంగా ఆ రెండు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

అంతేగాక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం నుంచి తెలంగాణలోనూ ఫెంగల్ తుఫాను కారణంగా వర్షాలు కురవనున్నాయి. రెండు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం మేఘావృతమై ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.

Fengal cyclone Rain alert for these districts in Telangana

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కాగా, శనివారం మధ్యాహ్నం నుంచే హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మేఘావృతమై చల్లని వాతావరణం ఏర్పడింది.

ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరికలు

ఫెంగల్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. శనివారం సాయంత్రానికి ఉత్తర తమిళనాడు- పుదుచ్చేరి తీరాల దగ్గర కారైకాల్‌, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో తుపాను తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తీరం వెంట 70 నుంచి 90 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఫ్లాష్‌ ఫ్లడ్స్‌కు అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+