Sonu Sood: అభిమానుల కోసం చెల్మి తండాకు వచ్చిన సోన్ సూద్..
సినిమాలో కనిపించే హీరోలు నిజజీవితంలో హీరోలు కాకపోవచ్చు. అలాగే సినిమాల్లో విలన్లుగా నటించే వారు నిజజీవితంలో విలన్లు కాకపోవచ్చు. సినిమాలో విలన్.. నిజజీవతంలో హీరో అయిన సోన్ సూద్ ఎంతో మందికి సాయం చేసి పెద్ద మనస్సు చాటుకున్నారు. కరోనా టైమ్ అనేక మందిని తన సొంత ఖర్చుతో స్వస్థలాలకు పంపించారు. దీంతో అతనికి దేశంలో భారీగా అభిమానులు పెరిగిపోయారు. ఎంతలా అంటే.. రెండేళ్ల క్రితం సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలం చెల్మి తండాలో సోనుసూద్ గుడి కట్టించేంతా..
Sonu sood sir visited narsaipally💗😘😘Real hero🥳🥳💯@SonuSood pic.twitter.com/TgUrarYwCr
— Kavya Erry (@Kavyaerry) January 18, 2023
విషయం తెలుసుకున్న సోన్ సూద్ చెల్మి తండాకు రావాలనుకున్నారు. దీంతో బుధవారం సోన్ సూద్ చెల్మి తండాలో పర్యటించారు. గిరిజన సంప్రదాయం మంగళ హారతులతో చెల్మి తండా వాసులు సోన్ సూద్ కు ఘన స్వాగతం పలికారు. గుడి కట్టినందుకు గ్రామస్తులు, ఫ్యాన్స్ కు థ్యాంక్స్ చెప్పాలని వచ్చానని సోన్ సూద్ తెలిపారు. కరోనా ఉన్నా లేకపోయినా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు.

చెల్మి తండా వాసులకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా తాను ఉన్నానని భరోసా ఇచ్చారు. తాను దేవుడిని కాదు. మీలా మనిషినే. మీ అభిమానాన్ని గుండెల్లో పెట్టుకుంటానని భావోద్వేగంగా చెప్పారు. కాగా ఈ గుడిలో సోన్ సూద్ విగ్రహం కూడా పెట్టారు. అంతకుముందు చేర్యాల పట్టణానికి చేరుకున్న సోనుసూద్ కు అభిమానులు, యువకులు ఘన స్వాగతలం పలికారు. ఆయనతో చాలామంది సెల్ఫీలు తీసుకున్నారు. చేర్యాలలో నిర్వహించిన బైక్ ర్యాలీలో సోనూసూద్ తో పాటు చాలామంది యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications