ఉగాది నాడు సినిమా అవార్డులు: తలసాని
తెలంగాణ రాష్ట్రంలో సినిమారంగంలో ఇచ్చే అవార్డులను వచ్చే ఉగాదిన ప్రధానం చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక,మత్స్య,పాడిపరిశ్రమాభివృద్ధి మరియు సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళ వారం సచివాలయంలో చలన చిత్రరంగ పరిశ్రమకు సంబంధించి అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సినిమా అవార్డులు, సింగిల్ విండో క్లియరెన్స్, ఆన్ లైన్ టికెటింగ్, మినీ కల్చరల్ సెంటర్లు, చిన్నతరహా చిత్రాల 5వ షో,చిత్ర పురికాలనీకి సౌకర్యాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి గారితో చర్చించి వచ్చే జనవరిలో నిర్ణయాలు ప్రకటించనున్నట్లు మంత్రి వెళ్ళడించారు.












Click it and Unblock the Notifications