సినిమాలకు ఇక ఆన్‌లైన్‌ టికెట్ విధానం- కొత్త ఫిల్మ్ సిటీ..!!

సినీ ఇండస్ట్రీ లో కీలక మార్పులకు రంగం సిద్దం అవుతోంది. పరిశ్రమను బలోపేతం చేయటం తో పాటుగా పారదర్శకత పెంచేలా కొత్త నిర్ణయాల పైన కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సినిమా పరిశ్రమలో రావాల్సిన మార్పుల పైన టాలీవుడ్ పెద్దలకు స్పష్టత ఇచ్చారు. అందులో భాగంగా టికెట్ల విధానం నుంచి సినీ పరిశ్రమకు సౌకర్యాల పైన నివేదికలు సిద్దం అవుతున్నాయి. తాజాగా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎఫ్డీసీకి కీలక ప్రతిపాద నలు చేసింది. ఇప్పుడు వీటి అమల్లో దిల్ రాజు పాత్ర కీలకంగా మారుతోంది.

ప్రభుత్వానికి ప్రతిపాదనలు
అల్లు అర్జున్ ఎపిసోడ్ తో తెలుగు సినీ పరిశ్రమలో మార్పుల గురించి చర్చ మొదలైంది. సినీ ప్రముఖులు తెలంగాణ సీఎం రేవంత్ తో భేటీ సమయంలో ప్రభుత్వం ఇండస్ట్రీకి పూర్తి సహకారం అందిస్తుందని..ఇందు కోసం పరిశ్రమకు ఏం కావాలో ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించారు. ఆ తరువాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తో దిల్ రాజు భేటీ సమయంలోనూ ఇండస్ట్రీలో రావాల్సిన మార్పుల గురించి పవన్ ప్రస్తావించారు. ఏపీలో షూటింగ్స్ అంశం ప్రస్తావనకు వచ్చింది. దీంతో, ఇప్పుడు తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆప్‌ కామర్స్‌ ప్రతినిధులు పలు ప్రతిపాదనలతో ప్రభుత్వానికి లేఖ రాసారు. అందులో పలు ఆసక్తి కర అంశాలను ప్రస్తావించారు.

Film Chamber of Commerce latest proposals for FDC over online movie tickets and new cinema city in Hyderabad

సినిమా సిటీ ఏర్పాటు
హైదరాబాద్ లో సినిమా సిటీ ఏర్పాటుకు వీలుగా 1500 నుంచి రెండు వేల ఎకరాల భూమని కేటాయించాలని కోరారు. గత ప్రభుత్వం 2020లో హైదరాబాద్‌లో సినిమా సిటీ ఏర్పాటు కోసం భూములను ఇస్తామని ప్రకటించిన విషయాన్ని లేఖలో గుర్తు చేసారు. శంషాబాద్ విమానాశ్రయాని కి 24 కి.మీ. పరిధిలో ఎక్కడైనా సినిమా సిటీ నిర్మాణానికి భూములను కేటాయించాలని సూచిం చింది. అదే సమయంలో టికెట్ల విక్రయాల విషయంలోనూ కీలక సూచనలు చేసింది. పెద్ద సిని మాల విడుదల సమయంలో బ్లాక్‌ టికెట్ల దందా జోరుగా సాగుతోందని వివరించింది. దీనిని నియంత్రణ కోసం ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థను ప్రవేశపెట్టాలని ఇండస్ట్రీ ప్రతిపాదించింది.

ఆన్‌లైన్‌ టికెట్‌ విధానం
ఆన్‌లైన్‌ టికెట్‌ విధానాన్ని అన్ని ప్రాంతాల్లోనూ అమలయ్యేలా దశల వారీగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచన చేసింది. ఇందు కోసం డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌ విషయంలోనూ ఒక నిర్ణయం తీసుకోవాలని కీలక ప్రతిపాదన చేసింది. ఈ- ప్లాట్‌ఫాంలో ఉన్న పలు కంపెనీలు సినిమాలను ప్రదర్శించేందుకు అధిక చార్జీలను వసూలు చేస్తున్నాయని, వాటిని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పరిధిలోనే ఒక డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ విధానాన్ని తీసుకొస్తే బాగుంటుందని సూచన చేసింది. సినిమా షూటింగ్‌లకు అవసరమైన అనుమతులను సింగిల్‌ విండో విధానంలో ఇవ్వాలని పరిశ్రమ ప్రభుత్వాన్ని కోరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+