KCR: కేసీఆర్ కారణజన్ముడు.. పొగడ్తలతో ముంచెత్తిన అల్లుడు హరీష్ రావు..
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ అద్భుత పాలనతో దేశాన్ని ఆలోచింపచేస్తున్న అనితర సాధ్యుడని హరీశ్ రావు ప్రశంసించారు.
సిద్దిపేట సిగలో వెలుగులు నింపిన పున్నమి చంద్రుడు, తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛా వాయువులు ప్రసాదించిన శేఖరుడని కొనియాడారు. కేసీఆర్ అంటే కారణజన్ముడిగా, చిరస్మరణీయుడిగా, ప్రజల తలరాతలను మార్చే మహనీయుడిగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకున్నారు.
" కేసీఆర్ అంటే కారణజన్ముడుగా... చిరస్మరణీయుడుగ ప్రజల తల రాతలను మార్చే మహనీయుడుగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలి.. !!
— Harish Rao Thanneeru (@BRSHarish) February 17, 2023
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు💐
2/2 pic.twitter.com/Vr3FUtjGyg

కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గారి ఆధ్వర్యంలో పాటను రూపొందించారు. వరంగల్ లో సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేక్ కట్ చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని అంధుల కోసం ప్రత్యేకంగా బ్రెయిలీ లిపిలో రూపొందించిన కేసీఆర్ సంక్షిప్త జీవిత చరిత్ర పుస్తకాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. "తెలంగాణ సీఎం కేసీఆర్‌గారికి జన్మదిన శుభాకాంక్షలు" అని మోడీ ట్వీట్ చేశారు.
Birthday greetings to Telangana CM Shri KCR Garu. I pray for his long life and good health. @TelanganaCMO
— Narendra Modi (@narendramodi) February 17, 2023












Click it and Unblock the Notifications