హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం: షాట్ సర్క్యూటే కారణం?

హైదరాబాద్: నగరంలోని బషీర్‌బాగ్‌ ప్రాంతంలో ఉన్న మహవీర్‌ హౌస్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. షాట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం సంభవించినట్టు అధికారులు తెలిపారు. భవనంలోని ఐదో అంతస్తులో షార్ట్ సర్క్యూట్ జరిగినట్టు చెప్పారు.

భవనంలోని వివిధ సంస్థలకు చెందిన ఉద్యోగులు విధులు ముగించుకుని వెళ్లిపోయిన అనంతరం ఈ ఘటన జరిగినట్టుగా చెబుతున్నారు. ఇదే భవనంలో ఐడీబీఐ బ్యాంక్ కూడా ఉండటంతో బ్యాంకు సిబ్బంది ఆందోళన చెందారు.

Fire accident

మహవీర్‌ హౌస్‌లో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టు చెబుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం కారణంగా బషీర్‌బాగ్‌లో బషీర్‌బాగ్‌లో భారీగా ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. దీంతో బషీర్ బాగ్ వైపు వెళ్లే వాహనాలను హైదర్ గూడ నుంచి కింగ్ కోటి మీదుగా మళ్లిస్తున్నారు.

గాలివానతో స్తంభించిన ట్రాఫిక్:

గురువారం మధ్యాహ్నాం ఆకాశం ఒక్కసారిగా మేఘావృతం కావడంతో నగరమంతా నల్లమబ్బులు కమ్ముకున్నాయి. చాలాచోట్ల భారీ ఈదురు గాలులు వీచాయి. గంట పాటు భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్ల పైకి వర్షపు నీరు రావడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+