భారీ అగ్నిప్రమాదం: కుప్పకూలిన 5అంతస్తుల భవనం, రూ. కోటి నష్టం(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని సీతారాంబాగ్‌లో ఇళ్ల మధ్య ఉన్న ఐదంతస్తుల ప్లాస్టిక్ గోదాములో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా ఎగిసిన మంటల ధాటికి ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. కాలిన ప్లాస్టిక్ వ్యర్థాలతో దట్టమైన పొగలు వెలువడడంతో స్థానికులు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు.
ఆదివారం ఉదయం 11గంటలకు అగ్నిప్రమాదం చోటు చేసుకోగా, రాత్రి 10గంటల వరకు కూడా అదుపులోకి రాలేదు. అగ్నిమాపక దళం సిబ్బంది, పోలీసులు, స్థానిక యువత మంటలను ఆర్పేందుకు శ్రమించారు. కాగా, ఉధృతమైన మంటలకు ఆ భవనం కుప్పకూలిపోయింది.

భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ నగరంలోని సీతారాంబాగ్‌లో ఇళ్ల మధ్య ఉన్న ఐదంతస్తుల ప్లాస్టిక్ గోదాములో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా ఎగిసిన మంటల ధాటికి ఐదంతస్తుల భవనం కుప్పకూలింది.

భారీ అగ్నిప్రమాదం
కాలిన ప్లాస్టిక్ వ్యర్థాలతో దట్టమైన పొగలు వెలువడడంతో స్థానికులు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు.

భారీ అగ్నిప్రమాదం
ఆదివారం ఉదయం 11గంటలకు అగ్నిప్రమాదం చోటు చేసుకోగా, రాత్రి 10గంటల వరకు కూడా అదుపులోకి రాలేదు.

భారీ అగ్నిప్రమాదం
అగ్నిమాపక దళం సిబ్బంది, పోలీసులు, స్థానిక యువత మంటలను ఆర్పేందుకు శ్రమించారు. కాగా, ఉధృతమైన మంటలకు ఆ భవనం కుప్పకూలిపోయింది.

భారీ అగ్నిప్రమాదం
సీతారాంబాగ్ ఓల్డ్‌మల్లేపల్లిలో ఇండేన్ గ్యాస్ గోదాము ఎదురుగా ప్లాస్టిక్ వ్యాపారం చేసే అమర్ అనే వ్యక్తి ఇటీవల ఐదంతస్తుల భవనం నిర్మించాడు.

భారీ అగ్నిప్రమాదం
బేగంబజార్‌లో వ్యాపారం చేసే అతను తన కార్యాకలాపాలకు సంబంధించి ప్లాస్టిక్ వస్తువులు ఈ ఐదు అంతస్తుల భవనంలో నిల్వ చేస్తున్నాడు.

భారీ అగ్నిప్రమాదం
కాగా, ఆదివారం ఉదయం దట్టమైన పొగ వెలువడటంతో సమాచారంతో హబీబ్‌నగర్ ఇన్‌స్పెక్టర్ సంజయ్, మంగళ్‌హాట్ పోలీసులు చేరుకున్నారు.

భారీ అగ్నిప్రమాదం
అగ్నిమాపక శాఖ అధికారులు గ్రౌండ్ ఫ్లోర్‌లో షెట్టర్‌ను పైకిలేపి మంటలను ఆర్పే యత్నం చేశారు. ఈ సమయంలో మొదటి, రెండో అంతస్తులో కూడా మంటలు చెలరేగి దట్టమైన పొగలు వెలువడ్డాయి.

భారీ అగ్నిప్రమాదం
మంటల వేడికి మొదటి, రెండో అంతస్తులోని గోడలు నెర్రలు బారాయి. పోలీసులు రెండు జేసీబీలు తెప్పించి మొదటి అంతస్తులోని గోడలను పాక్షికంగా తొలగించారు.

భారీ అగ్నిప్రమాదం
ఫైరింజన్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాయి. జలమండలి అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేశారు. గోషామహల్ ఏసీపీ రాంభూపాల్‌రావు, గ్రేటర్, ఫైర్ వింగ్ అధికారి వెంకటరమణ, రీజినల్ ఫైర్ ఆఫీసర్ పాపయ్య, డీఎఫ్‌ఓ శ్రీనివాస్‌రెడ్డి, గ్రేటర్ ఏడో సర్కిల్ ఏఎంఓహెచ్ డా.ఖాద్రీ సహాయక చర్యలు పర్యవేక్షించారు.

భారీ అగ్నిప్రమాదం
డీసీపీ వెంకటేశ్వర్‌రావు, మధ్య మండలం కమిషనర్ గౌరవ్ ఉత్పల్ ఈ స్థలాన్ని పరీశీలించారు.

భారీ అగ్నిప్రమాదం
అనుమతులు లేకుండా నిర్మాణం జరిగితే మాత్రం యజమానిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, టౌన్ ప్లానింగ్ అధికారులపై చర్యలు తీసుకుంటామని జెడ్‌సీ గౌరవ్ ఉత్పల్ చెప్పారు. కలెక్టర్, సీటీ ప్లానర్, ఆర్డీవో, మేయర్, ఉపమేయర్, పోలీస్ కమిషనర్ తదితరులు స్థలాన్ని సందర్శించారు.












Click it and Unblock the Notifications