పాతబస్తీలో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: పాతబస్తీ శాలిబండలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గోమతి ఎలక్ట్రానిక్స్ షోరూంలో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. మంటలను గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రెండు ఫైరింజన్లతో ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది. భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతుండడంతో పోలీసులు ఆ మార్గంలో వాహనాల రాకపోకలను నిషేధించారు.












Click it and Unblock the Notifications