ఐటి సంస్థలో మంటలు: యువతీయువకులను కాపాడారు
హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లోని ఓ భారీ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగి భవనంలోని సామగ్రి మొత్తం పూర్తిగా దగ్ధమైంది.
కాగా, ఈ భవనంలోని 3 అంతస్థుల్లో మాగ్నక్వెస్ట్ అనే సాఫ్ట్‌వేర్ సంస్ధ కొనసాగుతోంది. ప్రమాదం జరిగింది ఉదయమే కావడంతో కార్యాలయానికి ఉద్యోగులు ఇంకా రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
భవన నిర్మాణంలో ఎక్కువగా అద్దాలు ఉపయోగించడంతో సహాయక చర్యలు చేపట్టేందుకు అగ్నిమాపక సిబ్బందికి ఇబ్బందిగా మారింది. అద్దాలను ద్వంసం చేసిన ఫైర్ సిబ్బంది.. మంటలను ఆర్పేశారు.

ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో ఉన్న శ్రీవిద్య అనే అమ్మాయి, మరో అబ్బాయిని అగ్నిమాపక అధికారులు రక్షించారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పేందుకు ప్రయత్నించారు.
విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. అగ్ని ప్రమాదాల జరిగితే తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు భవన యాజమానులు తీసుకోలేదని పోలీసులు తెలిపారు. ఇదే ఘటన ఉదయం 10గంటల తర్వాత జరిగితే నాలుగో అంతస్థులోని ఉద్యోగులు కిందికి రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వారని చెప్పారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications