హరీష్ రావుకు తప్పిన పెను ప్రమాదం... ప్రచార వాహనంలో చెలరేగిన మంటలు

తూప్రాన్ : మాజీ మంత్రి టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావుకు తృటిలో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. తూప్రాన్‌లో హరీష్ రావు ఎన్నికల ప్రచారం చేస్తున్న వాహనంలో మంటలు చెలరేగాయి. వాహనంకు ఉన్న జనరేటర్ నుంచి మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఇది గమనించిన హరీష్ రావు, మెదక్ పార్లమెంటు అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిలు వెంటనే వాహనం దిగి దూరంగా వెళ్లారు. ఇక ఇదే వాహనంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్‌లు కూడా ఉన్నారు. వారు కూడా మంటలను గమనించిన వెంటనే వాహనం దిగి దూరంగా వెళ్లిపోయారు.

Fire broke out in Campaigning vehicle,Harish Rao exits safely

ఇక మంటలు చెలరేగకుండా స్థానికులు బకెట్లతో నీళ్లు చల్లడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. ఇక వాహనంలో ఉన్న నాయకులంతా సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటన ఎలా జరిగిందనేదానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల కోసం వీరంతా ప్రచారం నిర్వహిస్తున్నారు. మెదక్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్ రెడ్డి బరిలో నిల్చున్నారు. వీరి తరపున ఎమ్మెల్యే హరీష్ రావు ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ 16 ఎంపీ స్థానాలు గెల్చుకుంటే కేసీఆర్ మరొక వందమంది ఎంపీల మద్దతును కూడగట్టుకుని కేంద్రంలో కీలకంగా మారుతారని టీఆర్ఎస్ ప్రజలకు వివరించింది. హరీష్ రావు చాలా రోజుల తర్వాత మళ్లీ ప్రజల ముందు ప్రచారంలో కనపడటంతో క్యాడర్‌లో జోష్ కనిపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+