వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముందు సీఎం కేసీఆర్ అవినీతిని తగ్గిస్తే , ఉద్యోగుల్లో అంతమవుతోంది : రెవెన్యూ ఉద్యోగులు

|
Google Oneindia TeluguNews

ఇటివల తెలంగాణ సీఎం కేసీఆర్ రెవెన్యూ ఉద్యోగుల పై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి.సీఎం కేసీఆర్ తో తాడో పేడో తేల్చుకునేందుకు తెలంగాణ రెవెన్యూ ఉద్యోగులు సిద్దమయ్యారు. ఈనేపథ్యంలోనే వారు హైద్రబాద్ లో సమావేశమయ్యారు. సీఎం రెవెన్యూ ఉద్యోగులపై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ముందు సీఎం స్థాయిలో అవినీతిని తగ్గించాలని, అప్పుడే అవినీతీ అంతమవుతుందని అన్నారు

తెలంగాణ సీఎం కేసీఆర్ రెవెన్యూ ఉద్యోగులను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలతో రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. సీఎం తమని అవమానాలకు గురి చేస్తున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత అయిదు సంవత్సరాల్లో రెవెన్యూ ఉద్యోగులు చేసిన సేవలను అసెంబ్లీలో ప్రశంసించిన సీఎం ఇప్పుడు అలా అనడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కాగా ఒక్క రెవెన్యూ డిపార్ట్ మెంట్ ను ప్రక్షాళన చేస్తే అవినీతి అంతమవుతుందా అంటూ వారు ప్రశ్నించారు. రాష్ట్రంలోని మిగతా ఉద్యోగుల్లో కూడ అవినీతీ ,అలసత్వం ఉందని అన్నారు. కాగా రెవెన్యూ ఉద్యోగుల్లో అవినీతి పెరిగిందని ,అందుకే ఆ డిపార్ట్ మెంట్ ను ప్రక్షాళన చేస్తామని సీఎం వ్యాఖ్యానించారు. ఈనేపథ్యంలోనే రెవెన్యూ ఉద్యోగులు సీఎం కేసీఆర్ తమను అవమానిస్తున్నారని, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

first cm kcr has not to do bribe, then bribe will be finshed

ఈనేపథ్యంలోనే నేడు హైద్రబాద్ లో సమావేశంమైన ఉద్యోగులు ఈ అంశంపై చర్చించారు. కాగా సీఎం చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగులకు క్షమాపణ చేప్పాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు సీఎం కేసీఆర్ స్థాయిలో అవినీతి గురించి మాట్లాడడంపై వారు విస్మయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అవినీతి పోవాలంటే ముందుగా సీఎం స్థాయిలో అవినీతిని అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. రాజకీయ అవినీతిని అంతం చేసినప్పుడే రాష్ట్రంలో అవినీతీ ఉండదని వారు వ్యాఖ్యానించారు. కాగా ఈ సమావేశంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘాలనేతలు పాల్గోన్నారు.

English summary
first cm kcr has not to do bribe, then bribe will be finshed , and cm has to take actions about political bribe says revenue employees, they meet for discuss on cm kcr comments about bribe
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X