తొలిరాత్రే కాళరాత్రి: మిత్రుడితో భార్యను రేప్ చేయించాడు, 11 నెలల పాటు...

తొలిరాత్రే ఆమెకు కాళరాత్రి అయింది. భర్త తన మిత్రుడితో ఆమెను రేప్ చేయించాడు. ఈ పైశాచిక చర్య దాదాపు 11 నెలల పాటు సాగింది.

హైదరాబాద్‌: ఓ యువతికి తొలిరాత్రే కాళరాత్రి అయింది. తొలిరాత్రి గదిలోకి అడుగు పెట్టిన ఆమె షాక్ తిన్నది. భర్తతో పాటు మరో వ్యక్తిని చూసి ఆమె కంగు తిన్నది. దాంతో ఆమె బయటకు పరుగెత్తడానికి ప్రయత్నించింది. కానీ, భర్త అడ్డుకున్నాడు. ఫరవా లేదు.. లైట్ తీస్కో, అతను నా ఫ్రెండే అంటూ బుజ్జగించే ప్రయత్నం చేశాడు.

ఆమె ఎదిరించడంతో రాక్షసుడిగా మారాడు. భయపెట్టాడు. స్నేహితుడితో కలిసి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అలా తొలిరాత్రే ఓ కాళరాత్రిగా మారిన ఆ యువతిపై పలుమార్లు ఈ రకమైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అలా అత్తింట్లో 11నెలల పాటు ప్రతి రోజూ నరకాన్ని చూసింది.

First Night: man rapes his wife along with his friend

సహనం నశించి చివరకు ఈ నెల 11న కంచన్‌బాగ్‌ పోలీసులను ఆశ్రయించింది. భర్త, అతడికి సహకరించిన కుటుంబ సభ్యులు, స్నేహితుడిని కఠినంగా శిక్షించాలని వేడుకుంది. సోమవారం రాత్రి పురానా హవేలీ సౌతజోన్‌ డీసీపీ కార్యాలయంలో డీసీపీ సత్యనారాయణ అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించాడు.

హైదరాబాద్ పాతబస్తీలోని హఫీజ్‌ బాబానగర్‌కు చెందిన ఓ యువతి(21) డిగ్రీ పూర్తిచేసింది. 2014 ఏప్రిల్‌ 15న అదే ప్రాంతానికి చెందిన సలాముద్దీన్‌ అనే యువకుడితో ఆమెకు పెళ్లయింది. తొలిరాత్రి గదిలోకి కాలుపెట్టిన ఆమె.. భర్త పక్కన మరో వ్యక్తిని చూసి షాక్‌కు గురైంది.

భర్త ప్రోత్సాహంతో మరో వ్యక్తి తనపై దాడి చేస్తుంటే ఆ వేదనను మౌనంగా భరించింది. తర్వాత భర్తకు డ్రగ్స్‌తో పాటు, పలువురితో వివాహేతర సంబంధాలున్నాయని తెలిసి రోదించింది. కొన్నాళ్లకు భర్త సలాముద్దీన్‌ ఆస్ట్రేలియా వెళ్లాడు. అయినా వేధింపులు ఆగిపోలేదు. నీలిచిత్రాల వీడియోను ఆమెకు వాట్స్‌ప్‌లో పంపుతూ వేధించసాగాడు.

మరో వైపు అదనపు కట్నం కోసం అత్తతో పాటు ఆడపడుచులు వేధించసాగారు. కాగా ఈ నెల 4న ఆస్ట్రేలియా నుంచి వచ్చిన భర్త ఆమెకు మత్తుమందు ఇచ్చి స్నేహితుడితో కలసి లైంగికదాడికి పాల్పడ్డాడు. దాంతో ఆగిపోలేదు అతను. పెళ్లయి ఇన్నిరోజులైనా పిల్లలు పుట్టడం లేదని, ఓ ఖాజాబాబాతో శృంగారంలో పాల్గొంటే తెలివైన పిల్లలు పుడతారంటూ ఒత్తిడి తెచ్చాడు. దీనికి ఆమె అత్త, ఆడపడచులు మద్దతు ఇచ్చారు. సలాముద్దీన్‌ ఓ రోజు హఠాత్తుగా సదరు బాబాను ఇంటికే తీసుకొచ్చాడు.

యువతి ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు యువతి భర్తను, అత్తను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. భర్త స్నేహితుడు, బాబా పరారీలో ఉన్నారు. వాి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+