హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

8వ తేదీనే చేప ప్రసాదం.. ఆస్తమా బాధితులకు వరం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : జూన్ నెల అంటే వానలు గుర్తుకొస్తాయి. మృగశిర కార్తె గుర్తుకొస్తుంది. అలాగే చేప ప్రసాదం పంపిణీ కూడా జూన్ నెలలోనే ఉండటంతో చాలామంది ఆస్తమా, ఉబ్బసం బాధితులు ఆ నెల కోసం ఎదురుచూస్తుంటారు. ఆ క్రమంలో ఎప్పటిలాగే ఈసారి కూడా చేప ప్రసాదం పంపిణీకి బత్తిన సోదరుల ఆధ్వర్యంలో ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జూన్‌ 8వ తేదీ సాయంత్రం నుంచి చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం మరుసటి రోజు అంటే జూన్ 9వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది. ఆ మేరకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో.. బత్తిని మృగశిర ట్రస్ట్‌ కార్యదర్శి బత్తిని హరనాథ్‌ గౌడ్‌ వివరాలు వెల్లడించారు.

fish medicine distribution on 8th june

తస్మాత్ జాగ్రత్త.. అది టైమ్ పాస్ కాదట.. రోగమట..!<br>తస్మాత్ జాగ్రత్త.. అది టైమ్ పాస్ కాదట.. రోగమట..!

ప్రతి సంవత్సరం చేప ప్రసాదం పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. 1845లో తమ ముత్తాత వీరన్న హయాం నుంచి చేప ప్రసాదం పంపిణీజరుగుతున్నట్లు హరనాథ్ గౌడ్ వివరించారు. పోయినేడాది నాలుగు లక్షల మందికి చేప ప్రసాదం పంపిణీ చేశామని తెలిపారు.

English summary
Fish Medicine Distribution Held On June 8th. Arrangments are made in Hyderabad Nampally Exhibition Grounds.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X