టీచర్ పేరుతో ఫేస్ బుక్ ఖాతా తెరిచి అశ్లీల చిత్రాలు పోస్ట్, చివరికిలా...
టీచర్ పేరుతో ఫేస్ బుక్ అకౌంట్ ను ఓపెన్ చేసి అశ్లీల చిత్రాలు పోస్ట్ చేశాడు ఓ విద్యార్థి. ఈ విషయాన్ని గుర్తించిన పాఠశాల పూర్వవిద్యార్థులు అతడిని బెదిరించడంతో ఆత్మహత్య చేసుకొన్నాడు.ఈ ఘటనలో ఐదుగురు విద్య
హైదరాబాద్: టీచర్ పేరుతో ఫేస్ బుక్ అకౌంట్ ను ఓపెన్ చేసి అశ్లీల చిత్రాలు పోస్ట్ చేశాడు ఓ విద్యార్థి. ఈ విషయాన్ని గుర్తించిన పాఠశాల పూర్వవిద్యార్థులు అతడిని బెదిరించడంతో ఆత్మహత్య చేసుకొన్నాడు.ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.
గత నెల 30వ, తేదిన ఇంజాపూర్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివే విద్యార్థి మార్గం సాయికుమార్ హాస్తినాపురం నార్త్ ఎక్స్ టెన్షన్ లోని తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.
అయితే తన కొడుకు ఆత్మహత్యకు గల కారణాలను బయటపెట్టాలని తల్లిదండ్రులు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ను కలిసి కోరారు.దీంతో పోలీసులు విచారణను ప్రారంభించారు.

సాయికుమార్ పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయురాలి పేరుతో ఫేస్ బుక్ అకౌంట్ ను ఓపెన్ చేశాడు.ఈ పేస్ బుక్ అకౌంట్ లో అశ్లీల చిత్రాలను పోస్ట్ చేసేవాడు. ఈ విషయం కొందరు పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులకు తెలిసింది.
దీంతో ఆ విద్యార్థులు సాయికుమార్ ను పిలిచి బెదిరించారు. ఉపాధ్యాయురాలి పేరుతో ఎందుకు ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేశామని అడిగారు.అంతేకాదు నెట్ సెంటర్ కు తీసుకెళ్ళి ఫేస్ బుక్ అకౌంట్ ను తొలగించారు.
అయితే ఈ విషయమై సాయికుమార్ భయపడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సాయికుమార్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. దీంతో పోలీసులు సాయికుమార్ ను బెదిరించిన ఐదుగురు విద్యార్థులను మంగళవారం నాడు అరెస్టు చేశారు.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications