ఘోర రోడ్డుప్రమాదం: ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు, నలుగురు మృతి

హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే జిల్లాలోని ధర్మాపూర్ వద్ద ఆర్టీసీ బస్సు- ఆటోను ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

మృతుల్లో చిన్నారి, ఓ వృద్ధురాలు ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులను మహబూబ్ నగర్ జిల్లా పోతన్ పల్లి వాసులుగా వాసులుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో ఏడుగురు ప్రయాణిస్తున్నారు.

five dead in road accident at mahabubnagar

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుంచి పోతన్‌పల్లికి వెళ్తున్న ఆటో, దేవరకద్ర నుంచి మహబూబ్‌నగర్‌ వస్తున్న మెట్రో బస్సును ఎదురెదురుగా వచ్చి ఢీకొనటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు.

సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా మహబూబ్‌నగర్‌-రాయ్‌చూయ్‌ ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకోవటంతో ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

అత్యాచారయత్నం: అవమానంతో వివాహిత ఆత్మహత్య

తనపై జరిగిన అత్యాచారయత్నంతో కుంగిపోయిన ఓ వివాహిత చివరికి ఒంటికి నిప్పంటించుకొని తనువు చాలించిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా ఉప్పునుంతల మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం.. కాంసానిపల్లి గ్రామానికి చెందిన మాగాణి లలిత (21)పై అదే గ్రామానికి చెందిన కూర్మయ్య అనే వ్యక్తి ఆదివారం అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.

అతడి బారి నుంచి తప్పించుకొన్న ఆమె సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆమె రెండు రోజుల పాటు అవమాన భారంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు వేసుకొని ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకొంది.

తలుపు సందుల్లోంచి పొగరావడంతో గమనించిన ఇరుగుపొరుగు తలుపులు విరగొట్టారు. అప్పటికే తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న ఆమెను అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగానే ఆమె మృతి చెందింది. లలిత తండ్రి నర్సింహ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+