కామపిశాచి: ఐదేళ్ల చిన్నారిపై పెద్దనాన్న అత్యాచారం
హైదరాబాద్: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతను చిన్నారి పెదనాన్నే కావడం గమనార్హం. రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గ్రామానికి చెందిన గుంటి శ్రీనివాస్ (45) సోమవారం సాయంత్రం కూతురు వరుస అయ్యే ఐదేళ్ల బాలికను తన ఇంట్లోకి తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు మంగళవారం మంచాల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వైద్య పరీక్షల నిమిత్తం బాలికను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాస్ ఇద్దరు భార్యలు గతంలో చనిపోయారని, ఆయన మద్యానికి బానిస అయ్యాడని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వ్యక్తి ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా కులకచర్ల మండల పరిధిలోని కొత్తపల్లి తండాలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేశ్వర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం కొత్తపల్లి గ్రామానికి చెందిన సభావత్ రాములు(32) నాలుగు సంవత్సరాల క్రితం నగరానికి వలస వెళ్లిన రాములు బావమరిది పెళ్లి నిమిత్తం గ్రామానికి వచ్చాడు.
ఆర్థిక ఇబ్బందులతో తాగుడుకు బానిసైన రాములు ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య తులసీబాయి ఫిర్యాధు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications