రూ.99కే హైదరాబాద్ టు విజయవాడ - ఏసీ బస్సు ప్రయాణం..!!
బస్సు ప్రయాణీకులకు అరుదైన ఆఫర్. రూ 99 కే హైదరాబాద్ నుంచి విజయవాడకు ఏసీ బస్సు లో ప్రయాణం. అయిదు గంటల్లో గమ్యస్థానం చేరుకునే అవకాశం. పూర్తి సౌకర్యవంతంగా ఉండే ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య అందుబాటులోకి వచ్చాయి. ఈ బస్సుల్లో అన్ని ప్రభుత్వ పథకాలు అమల్లో ఉంటాయి. త్వరలో ఇదే తరహాలో ఏసీ బస్సులనూ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈటీవో మోటార్స్ తో కలిసి ఫ్లిక్స్ బస్ కొత్తగా విద్యుత్ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. ఈ సంస్థ ఇప్పటికే హైదరాబాద్ - బెంగళూరు మధ్య ఈ తరహా బస్సులను నడుపుతోంది. ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించింది. ర 99 కే ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. జర్మనీకి చెందిన ఫ్లిక్స్ బస్ సంస్థ దక్షిణాది రాష్ట్రాల్లో తమ సేవలను పెంచుకునేందుకు కొత్త ప్రణాళికలతో ముందుకు వచ్చింది. బెంగళూరు నుంచి దక్షిణ రాష్ట్రాల్లోని పలు ప్రధాన నగరాలకు ఇప్పటికే తక్కువ ధరలతో విద్యుత్ బస్సులను నడుపుతు న్నారు. మత్తం 33 నగరాలకు ఈ బస్సులు అందుబాటులోకి వచ్చాయి.

కాగా, ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడకు విద్యుత్ - ఏసీ బస్సును ప్రారంభించారు. ఇదే విధంగా త్వరలోనే స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకు రానున్నారు. త్వరలో విజయవాడ
- విశాఖ మధ్య కూడా ఇదే తరహా బస్సులను ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఫ్లిక్స్ బస్ సేవలు కోయంబత్తూరు, మధురై, తిరుపతి, బెలగావిలకు విస్తరిస్తున్నారు. హైదరాబాద్ - విజయవాడ సేవలు మొదలైన తరువాత నాలుగు వారాల పాటు రూ 99కే ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. ఈ బస్సులో 49 మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రద్దీ ఉన్న మార్గాల్లో ఈ తరహా సర్వీసులు అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications