కలెక్టర్ అమ్రపాలి ఫిట్ నెస్ కు కారణమిదే
వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి కాటా. ఆమె ఫిట్ నెస్ రహస్యం తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు.ఆమె ఫిట్ గా ఉండడానికి ఖచ్చితమైన ఆహారపు అలవాట్లే కారణమని చెబుతారు.దీనికితోడు యోగా కూడ ఖచ్చితంగా చేస్తారు.
వరంగల్: వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి కాటా. ఆమె ఫిట్ నెస్ రహస్యం తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు.ఆమె ఫిట్ గా ఉండడానికి ఖచ్చితమైన ఆహారపు అలవాట్లే కారణమని చెబుతారు.
దీనికితోడు యోగా కూడ ఖచ్చితంగా చేస్తారు.
ఆమ్రపాల్ ది వైజాగ్. ఆమె తండ్రి ఆంధ్రయూనివర్శిటీలో ప్రోఫెసర్ గా పనిచేశారు. ఆమె చదువంతా విశాఖలో సాగింది. జీవితంలో తాను అనుకొన్న లక్ష్యాన్ని సాధించింది కలెక్టర్ ఆమ్రపాలి.

ఐఎఎస్ కావాలనే తన కోరికను నెరవేర్చుకొంది. వృత్తిపట్ల ఆమెకు ఉన్న నిబద్దతతో పలువురి ప్రశంసలను పొందుతోంది. సోషల్ మీడియాలో ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉంది.
ఏదైనా సమస్యను పరిష్కరించేవరకు ఆమెనిద్రపోరనే పేరు కూడ ఉంది. వృత్తికి, వ్యక్తిగత జీవితానికి స్పష్టమైన విభజన రేఖ పెట్టుకొన్నారామె.
కలెక్టర్ గా నిత్యం ఆమె బిజీగా ఉంటారు.అయినా ఆమె ఫిట్ నెస్ విషయంలో మాత్రం జాగ్రత్తలను తీసుకొంటారు.ఉదయాన్నే ఆమె యోగా చేస్తారు. యోగాను మాత్రం మర్చిపోరు.
బ్రేక్ ఫాస్ట్ గా రెండు ఇడ్లీలు మాత్రమే తీసుకొంటారు. మధ్యాహ్నం పూట పప్పు కర్రీ, నెయ్యితో కలిపి తింటారు. రాత్రిపూట రెండు చపాతీలను తింటారు.ఆమె పూర్తిగా శాఖాహరం మాత్రమే తీసుకొంటారు. మాంసాహరాన్ని ముట్టుకోరు.
ఆమె ఫిట్ గా ఉండడడానికి ఆమె ఆహరపు అలవాట్లే ప్రధాన కారణంగా నిలుస్తాయి. అరుంధతీరాయ్ పుస్తకాలంటే ఆమెకు చాల ఇష్టం. ప్రకృతితో మమేకమౌతూ ఆమె ఉదయాన్నీ ప్రారంభిస్తారు.












Click it and Unblock the Notifications