మాజీ సీఎం కేసీఆర్కు భద్రత కుదింపు..!? ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్..!
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు భద్రత కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మాజీ లకు భద్రత విషయంలో అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా మాజీ సీఎంతో సహా.. గతంలో మంత్రులు..ఎమ్మెల్యేలకు భద్రత విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద ఆస్పత్రి నుంచి శుక్రవారం ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్.. నేరుగా బంజారాహిల్స్ నంది నగర్‌లోని తన సొంతింటికి వెళ్లారు.
Recommended Video

భద్రత కుదింపు : తెలంగాణ ప్రభుత్వం మాజీలకు భద్రత కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ కు గతంలో జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత ఉండేది. అయితే ప్రస్తుతం దీనిని వై కేటగిరీగా కుదించారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి 4+4 గన్ మెన్లతో పాటూ ఎస్కార్ట్ వాహనం అందుబాటులో ఉండనుంది. అలాగే ఇంటి ముందు సెంట్రీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటూ మాజీలకు అవసరమైన భద్రత మాత్రమే కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం. కార్పొరేషన్ చైర్మెన్లకు గన్ మెన్లను కూడా తొలగిస్తూ కాంగ్రెస్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

మాజీలకు మార్పు : ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న మాజీ మంత్రులకు 2+2 గన్ మెన్లను కేటాయించింది. ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రత ఎవరికి అవసరం అనేదానిపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు అధికారులు. ఇంటెలిజెన్స్ అధికారుల సూచనల మేరకు గన్మెన్లను పోలీసు శాఖ కేటాయించనుంది . అయితే అక్బరుద్దీన్, రాజాసింగ్ కు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన భద్రతను గతంలో లాగానే యధావిధిగా కొనసాగిస్తోంది. ఇటు, కేసీఆర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. హిప్ రిప్లేస్‌మెంట్ సర్జరీ కారణంగా కేసీఆర్ యశోద ఆస్పత్రిలో వారం రోజుల పాటు ఉన్నారు.
కేసీఆర్ డిశ్చార్జ్ : ఈ నెల 8వ తేదీన రాత్రి కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో కాలు జారి కింద పడిన సంగతి తెలిసిందే. దీంతో కేసీఆర్‌ను కుటుంబ సభ్యులు సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. 9వ తేదీన కేసీఆర్ హిప్ రిప్లేస్‌మెంట్ సర్జరీ నిర్వహించారు. ఆ తర్వాత కేసీఆర్‌ను వాకర్ సాయంతో వైద్యులు నడిపించారు. చికిత్స అనంతరం కేసీఆర్ కోలుకోవడంతో.. వైద్యులు ఇవాళ డిశ్చార్జ్ చేశారు. మరో నాలుగైదు వారాల పాటు కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆస్పత్రిలో ఉన్న సమయంలో సీఎం రేవంత్ తో సహా పలువురు రాజకీయ - సినీ ప్రముఖులు కేసీఆర్ ను పరామర్శించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications