కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే- బిగ్ టర్న్

Koneru Konappa: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ శాసన సభ్యుడు కోనేరు కోనప్ప భారత్ రాష్ట్ర సమితిలో చేరారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి టీ హరీష్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. ఆ పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఇదివరకే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారాయన. క్రియాశీలక రాజకీయాలకు కొద్దికాలం పాటు దూరంగా ఉండాలనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని, ఇప్పటికప్పుడు ఏ పార్టీలో చేరట్లేదనీ అప్పట్లో వెల్లడించారు. తాజాగా బీఆర్ఎస్ లో చేరారు.

ఆయన సొంత నియోజకవర్గం కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ కాగజ్‌నగర్. నియోజకవర్గ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాల వల్లే కోనేరు కోనప్ప రాజీనామాకు దారి తీశాయని చెబుతున్నారు. సొంతగూటికి చేరిన తరువాత ఆయనను పక్కనపెట్టారని చెబుతున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు కొనసాగారు కోనేరు కోనప్ప. 2004లో సిర్పూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.

Former Congress MLA Koneru Konappa Makes Big Move to BRS

2014 నాటి ఎన్నికల్లో బహుజన్ సమాజ్‌ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత బీఆర్ఎస్‌లో చేరి, ఆ పార్టీ తరఫున పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. నియోజకవర్గంలో తనపై పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను పార్టీలో చేర్చుకోవడం పట్ల కేసీఆర్‌తో విభేదించారు. గ‌త ఏడాది మార్చిలో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్‌ తీర్థాన్ని పుచ్చుకున్నారు.

ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణాలు, నియోజకవర్గస్థాయిలో నెలకొన్న పరిస్థితుల వల్ల ఆయన మళ్లీ బీఆర్ఎస్ కే రావాల్సొచ్చింది. తన నియోజకవర్గానికి కేటాయించిన ఫ్లైఓవర్ రద్దు కావడం కోనప్పను తీవ్ర అసంతృప్తికి గురి చేసిందని అంటున్నారు. కాంగ్రెస్‌ను దొంగల గుంపుగా విమర్శించారాయన. ఈ విషయంపై రేవంత్ రెడ్డితో మాట్లాడినప్పటికీ ఎలాంటి హామీ లభించలేదని, ఫలితంగా వారం రోజుల కిందటే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారనే ప్రచారం జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+