సీఎం రేవంత్ ఆఫర్ పై నళిని కీలక నిర్ణయం - మనసు కదిలించేలా..!!

మాజీ డీఎస్పీ నళిని మరోసారి వార్తల్లో నిలిచారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళినికి పోలీస్ శాఖలో అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. నళినికి ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని ఆదేశించారు. దీని పైన నళిని స్పందించారు. ఉద్యోగంలో తిరిగి చేరటంపై తన అభిప్రాయం స్పష్టం చేసారు. సీఎం కు తాజాగా ఒక అభ్యర్దన చేసారు.

నళిని పై సీఎం రేవంత్ నిర్ణయం: తెలంగాణ ఉద్యమ సమయంలో డీఎస్పీగా పని చేసిన నళిని ఒక సంచలనంగా నిలిచారు. 2009 డిసెంబర్ 9న నళిని తెలంగాణకు మద్దతుగా తన ఉద్యోగానికి రాజీనామా చేసారు. కాగా, ఉద్యమం కోసం ఉద్యోగం కోల్పోయిన నళినికి తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని రేవంత్ సూచన చేసారు. పోలీస్‌ శాఖలో మార్గదర్శకాలకు సంబంధించి అవరోధాలు ఏమైనా ఉంటే.. అదే హోదాలో ఇతర శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వాలని సూచించారు.

Former DSP Nalini Reacts on CM Revanth Reddy Decision to induct her in Service, see deets

ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన చాలామంది తిరిగి ఉద్యొగాల్లో చేరిన విషయాన్ని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ఇదే నియమాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉన్నత ఉద్యోగాన్ని త్యజించిన నళినికి మాత్రం తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో అభ్యంతరాలు ఎందుకు ఉండాలని అన్నారు.

స్పందించిన నళిని: తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసిన నాయకులకు పదవులు వచ్చినప్పుడు, నళినికి ఎందుకు అన్యాయం జరగాలన్నారు. ఇప్పుడు రేవంత్ ఆలోచనల పైన నళిని స్పందించారు. రేవంత్ చూపించిన ఆత్మీయత నతకు గొప్ప స్వాంతన కలిగించాయని పేర్కొన్నారు. నాటి ప్రభుత్వం తనను మూడేళ్లు ఇబ్బంది పెట్టిందని గుర్తు చేసుకున్నారు. మాజీ సీఎం రోశయ్య మహిళా దినోత్సవం నాడు తనకు తన ఉద్యోగాన్ని కానుకగా ఇస్తున్నట్లు ప్రకటించారు.

దీంతో..నళిని తన రాజీనామా ఉప సంహరించుకొని తిరిగి ఉద్యోగంలో చేరారు. ఆ తరువాత ఎదురైన పరిణామాలతో నళిని ఉద్యోగానికి మరోసారి దూరమయ్యారు. నాడు ఎదుర్కొన్న అవమానాలను నళిని నాటి సీఎం కిరణ్ కు ఏకరువు పెట్టారు. ఉద్యమ నేతలు పట్టించుకోలేదని వాపోయారు. సోనియా, సుష్మ స్వరాజ్ కు లేఖలు రాసిన అంశాన్ని నళిని గుర్తు చేసుకున్నారు.

సీఎంకు తాజా అభ్యర్దన: దీంతో, 2011 నవంబర్ 1న ఫార్మాట్ లో నళిని డీజీపీకి తన రాజీనామా లేఖ సమర్పించారు. ఇప్పుడు 12 ఏళ్ల తరువాత రేవంత్ ఇప్పుడు స్పందించిన తీరు పైన నళిని ఉద్వేగానికి లోనయ్యారు. తాను ఎవరి కోసం ఇక ఎటువంటి త్యాగాలు చేయలేనని స్పష్టం చేసారు. వేద ప్రచారకురాలిగా సనాతన ధరమాన్ని ప్రచారం చేయటమే తన ముందున్న కర్తవ్యంగా నళిని స్పష్టం చేసారు. పోలీసు కాకుండా వేరే ఉద్యోగం తాను చేయలేననని వివరించారు.

విద్యాదానం చేస్తూ..పుణ్యం మూటకట్టుకోవాలనే కోరిక తప్ప తనకేమీ లేదన్నారు. తనకు ఉద్యోగం ఇవ్వటానికి బదులుగా తన ధర్మ ప్రచారానికి ఉపయోగపడేలా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తానని నళిని పేర్కొన్నారు. మీలో మంచి స్పార్క్ ఉంది. మీ నుంచి చక్కని పాలన ఆశిస్తున్నానంటూ నళిని పేర్కొన్న అంశాలు ఇప్పుడు ప్రతీ ఒక్కరినీ కదలించేలా ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+