ఈటల యాక్షన్ ప్లాన్ ఏంటి... రాజీనామా ప్రకటించబోతున్నారా... ఏం చేయబోతున్నారు...?

భూకబ్జా ఆరోపణలతో మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ భవిష్యత్ యాక్షన్ ప్లాన్‌పై సర్వత్రా చర్చ జరుగుతోంది. తనపై ఆరోపణలు మొదలు బర్తరఫ్ వరకూ శామీర్‌పేట్‌లోని నివాసానికే పరిమితమైన ఈటల... సోమవారం తన నియోజకవర్గం హుజురాబాద్‌కు వెళ్లారు. అక్కడే మూడు రోజుల పాటు ఆయన ఉండనున్నారని తెలుస్తోంది. ఈ సందర్భంగా అక్కడి కార్యకర్తలు,అభిమానులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బహుశా నేడో,రేపో ఆయన రాజీనామా చేయవచ్చునన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

వెయ్యి కార్లతో హుజురాబాద్‌కు...

వెయ్యి కార్లతో హుజురాబాద్‌కు...

సోమవారం(మే 3) శామీర్‌పేట్‌లోని తన నివాసం నుంచి దాదాపు వెయ్యి కార్లతో ఈటల రాజేందర్ హుజురాబాద్ చేరుకున్నారు. మార్గమధ్యలో సిద్దిపేట,హుస్నాబాద్‌లలో అభిమానులు ఆయనకు సంఘీభావం తెలిపారు. హుజురాబాద్ చేరుకున్న అనంతరం పట్టణంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద ఉన్న బాబాసాహెబ్ విగ్రహానికి పూల మాల వేశారు. అక్కడి నుండి నేరుగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుకు వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడిన ఈటల... అడగడుగునా తన కోసం ఎదురు చూస్తున్న జనం ఆదరణను మరవలేకపోతున్నానని అన్నారు.

యాక్షన్ ప్లాన్ ఏంటి..?

యాక్షన్ ప్లాన్ ఏంటి..?

భవిష్యత్ కార్యాచరణపై మాత్రం ఈటల స్పష్టత ఇవ్వలేదు. హుజురాబాద్‌లో దీనిపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన మౌనంగా ఉండిపోయారు. అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఉపఎన్నికను ఎదుర్కొనేందుకు ఆయన సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఉపఎన్నికలో గెలిచి ప్రజల్లో తన బలమేంటో నిరూపించాలని ఆయన భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మూడు రోజుల హుజురాబాద్ పర్యటనలో భాగంగా ఈటల ఏ క్షణమైనా రాజీనామా ప్రకటించవచ్చునన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

భారీగా తరలివచ్చిన అభిమానులు...

భారీగా తరలివచ్చిన అభిమానులు...

మంత్రి వర్గం నుంచి తొలగించిన తర్వాత తొలిసారి ఈటల హుజురాబాద్ రావడంతో ఆయన అభిమానులు భారీ ఎత్తున పట్టణానికి తరలివచ్చారు. నియోజకవర్గంతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి,ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. జై ఈటల అంటూ మద్దతు తెలిపారు. ఈటలకు ఇప్పటికే పలువురు బీసీ నేతలు కూడా మద్దతు ప్రకటించారు. ఇప్పటికైతే ఈటల తన భవిష్యత్ కార్యాచరణ వెల్లడించలేదు. ఆయన కొత్త పార్టీ ప్రకటిస్తారా... లేక బీజేపీలోకి వెళ్తారా అన్న చర్చ కూడా జరుగుతోంది. మరో ఒకటి,రెండు రోజుల్లో ఈటల యాక్షన్ ప్లాన్‌పై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Recommended Video

    Telangana : భారం నిరుపేదలపై పడకుండా ప్రభుత్వమే భరించాలి - Jeevan Reddy

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+