ప్రాణం తీసిన వేగం: మాజీ ఎమ్మెల్యే కుమారుడు సహా ఇద్దరు మృతి(పిక్చర్స్)
నల్గొండ: జిల్లాలోని కట్టంగూర్ మండలం ఎర్రసానిగూడెం స్టేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్ కుమారుడు సహా ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

అక్కడికక్కడే మృతి..
కొత్తగూడెం నుంచి జడ్చర్ల వైపు ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న భద్రాద్రి- కొత్తగూడేనికి చెందిన వైద్యుడు మద్దికాయల విజయ్‌కుమార్ (55), ఆయన అత్త సావిత్రి భాయి (78) అక్కడికక్కడే మృతిచెందారు.

మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
విజయ్‌కుమార్ భార్య, వైద్యురాలు ఝాన్సీ (55), మరో యువతి శోభ (18) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. ఝాన్సీ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి తరలించారు.

అతివేగమే..
జడ్చర్లలో ఓ శుభకార్యానికి వెళుతుండగా ఈ ప్రమాదంచోటుచేసుకుంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

సహాయక చర్యల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వీరేశం
ప్రమాదం జరిగిన సమయంలో అటుగా వెళ్తున్న నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. మృతదేహాలను నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications