బీజేపీ నేత రాజాసింగ్ ఫేస్‌బుక్ హ్యాక్ చేసిన దుండగులు: వారిపనేనంటూ ఆరోపణ

హైదరాబాద్: బీజేపీ నేత, గోషామహల్ మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫేస్‌బుక్ ఖాతా హ్యాకైంది. ఈ క్రమంలో బాధ్యలపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ అడిషనల్ డీసీపీ రఘువీర్‌ను రాజాసింగ్ సోమవారం కలిసి ఫిర్యాదు చేశారు.

అనంతరం రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కుట్రపూరితంగా తన ఫేస్‌బుక్‌ను హ్యాక్ చేశారని ఆరోపించారు. తనకు తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగా 5లక్షలకుపైగా ఫాలోవర్స్ ఉన్నారని తెలిపారు.

Former MLA T Raja Singh facebook page hacked by unknown sources

అక్టోబర్ 2న ఓసారి హ్యాకింగ్‌కు ప్రయత్నించి విఫలమయ్యారని, అక్టోబర్ 7న హ్యాక్ చేశారని రాజాసింగ్ తెలిపారు. ఫేస్‌బుక్ హ్యాక్ వెనుక ఎంఐఎం నేతలు ఉన్నట్లు ఆయన ఆరోపించారు.

గోషామహల్ నుంచి తనని ఓడించేందుకు అన్ని రాజకీయ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని అన్నారు. అయితే, ఎన్ని కుట్రలు చేసినా భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని రాజా సింగ్ ధీమా వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+