Vivek: పార్టీ మారే ప్రసక్తే లేదు.. స్పష్టం చేసిన వివేక్ వెంకటస్వామి..
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ తప్పుకున్నప్పటి నుంచి బీజేపీ బలహీన పడినట్లు వార్తలు వస్తున్నాయి ఇప్పటికే కొందరు నేతలు బీజేపీని వీడే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి చంద్రశేఖర్ కాంగ్రెస్ చేరారు. తాజాగా మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి పార్టీ మారుతారని ప్రచారం జరిగింది. ఆయన కాంగ్రెస్ చేరుతారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే దీనిపై వివేక్ స్పందించారు. తాను కాంగ్రెస్ చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారం వాస్తవం లేదని చెప్పారు.
ఈ మేరకు మంగళవారం వివేక్ ఓ ప్రకటన విడుదల చేశారు. తాను కాంగ్రెస్ లో చేరుతానంటూ కొన్ని వార్త పత్రికలు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందన్నారు. అదంతా అబద్ధమన్నారు. తాను కాంగ్రెస్ నేతలతో టచ్ లేనని వివేక్ స్పష్టం చేశారు. గత రెండు రోజులుగా పూణేలో ఉన్నట్లు చెప్పారు. గతంలో అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఇలా ప్రచారం చేశారని వివేక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారతున్నట్లు వస్తున్న వార్తలను వివేక్ తీవ్రంగా ఖండించారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి పార్టీ మారుతున్నారంటూ కొందరు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఆ వార్తలను ఎవరూ నమ్మొద్దని బీజేపీ మంచిర్యాల జిల్లా జనరల్ సెక్రటరీ అందుగుల శ్రీనివాస్ కోరారు. వివేక్ బీజేపీని విడిచివెళ్లరని చెప్పారు. వివేక్ తండ్రి వెంకటస్వామి కాంగ్రెస్ సుదీర్ఘకారం పని చేశారు. ఆయన పెద్దపల్లి నుంచి ఎంపిగా అనేకసార్లు గెలిచారు. ఆయన అనంతరం ఆయన కొడుకులు వివేక్, వినోద్ కూడా కాంగ్రెస్ లోనే ఉన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ ఉంటూ వివేక్ తెలంగాణ కోసం పోరాటం చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ చేచారు. కొద్ది రోజులు బీఆర్ఎస్ ఉన్న తర్వాత తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఆయన సోదరుడు వినోద్ మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. ఆయన బెల్లంపల్లి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. వివేక్ తెలంగాణ ఉద్యమ సయంలో వీ6 న్యూస్ స్థాపించి ఉద్యమానికి అండగా నిలబడ్డారు. ఆ తర్వాత వెలుగు దినపత్రిక కూడా ప్రారంభించారు.












Click it and Unblock the Notifications