రేవంత్ గెలుపు వెనుక మేమే, మమ్మల్ని బేరంపెట్టాలని, పీసీసీ చీఫ్‌పై కన్ను: ఎమ్మెల్యే సంచలనం
కొడంగల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి గెలుపుపై నారాయణపేట్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గురువారం ట్విస్ట్ ఇచ్చారు. రేవంత్ సొంతగా గెలవలేదని ఆయన అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్: కొడంగల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి గెలుపుపై నారాయణపేట్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గురువారం ట్విస్ట్ ఇచ్చారు. రేవంత్ సొంతగా గెలవలేదని ఆయన అభిప్రాయపడ్డారు.
Recommended Video


రేవంత్ పైన రాజేందర్ రెడ్డి స్పందన
నారాయణపేట ఎమ్మెల్యే కూడా 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత అధికార టీఆర్ఎస్‌లో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో 2016 ప్రారంభంలో ఆయన గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో రాజేందర్ రెడ్డి స్పందించారు.

రేవంత్ గెలవడానికి మేమే కారణం
2014 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలవడానికి తామే కారణమని రాజేందర్ రెడ్డి చెప్పారు. తమ వల్లే ఆయన విజయం సాధించారని తెలిపారు. అలాంటి రేవంత్ ఉప ఎన్నికలు వస్తే ఓడిపోవడం ఖాయమని అభిప్రాయపడ్డారు. తాము (టీఆర్ఎస్) 40 వేల మెజార్టీతో గెలుస్తుందని చెప్పారు.

రేవంత్ రాజీనామా ఎక్కడ?
రేవంత్ రెడ్డి రాజీనామా ఎక్కడకు వెళ్లిందో చెప్పాలని రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. తాను రాజీనామా లేఖ ఇచ్చానని రేవంత్, లేఖ ఇవ్వలేదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎల్ రమణ చెబుతున్నారని గుర్తు చేశారు. ఇందులో ఏది నమ్మాలో చెప్పాలన్నారు.

పీసీసీ చీఫ్ పదవి వస్తుందని ప్రచారం
తనకు కాంగ్రెస్ పార్టీలో మంచి పదవి వస్తుందని రేవంత్ అందులో చేరకముందు నుంచే ప్రచారం చేసుకున్నారని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి వస్తుందని ఆయన ప్రచారం చేసుకున్నారని విమర్శించారు.

మీడియాకు ముఖం ఎందుకు చాటేశారు
రేవంత్ రెడ్డి మీడియాకు ముఖం ఎందుకు చాటేస్తున్నారో చెప్పాలని రాజేందర్ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తీరు గమనించే తాము తెరాసలో చేరామని ఆయన స్పష్టం చేశారు. రేవంత్ తీరును కొడంగల్ ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రేవంత్‌ను ఓడిస్తారన్నారు.

బేరం పెట్టాలని చూశారు
కొడంగల్లో ఉప ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అందుకే, రేవంత్ వెనుకడుగు వేశారని రాజేందర్ రెడ్డి విమర్శించారు. తమను కాంగ్రెస్ పార్టీకి బేరం పెట్టాలని రేవంత్ ప్రయత్నించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications