తల్లులకు కడుపుకోత: నిమజ్జనోత్సవంలో 4గురు చిన్నారుల మృతి(పిక్చర్స్)
హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో గురువారం జరిగిన గణేశ నిమజ్జనోత్సవంలో అపశ్రులు చోటుచేసుకున్నాయి. నలుగురు చిన్నారులు సహా ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరో యువకుడు నాలాలో గల్లంతయ్యాడు. ఇది ఇలా ఉండగా, బంజారాహిల్స్‌లో గణేశుని విగ్రహం లారీలో ఎక్కిస్తుండగా కిందక పడిపోయింది.

కుటుంబసభ్యుల రోదనలు
సెలవు రోజున సరదాగా చెరువు గట్టుకు వెళ్లిన నలుగురు చిన్నారులను నీటి గుంత మింగేసింది. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటన గురువారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మహ్మద్‌నగర్‌లోని పోరడోనికుంటలో చోటు చేసుకుంది.

మృతిచెందిన చిన్నారులు
మహ్మద్‌నగర్ గ్రామానికి చెందిన ఏడుగురు విద్యార్థులు గురువారం నిమజ్జోత్సవ సెలవు కావడంతో సరదాగా గ్రామం పక్కనే ఉన్న పోరడోనికుంట చెరువు వద్దకు వెళ్లారు. వీరిలో నలుగురు చిన్నారులు కాళ్లు కడుక్కోవడానికంటూ చెరువులోని నీటి గుంతలోకి దిగారు.

చిన్నారుల మృతదేహాలు
ప్రమాదవశాత్తు నీటిలో మునిగి శివకుమార్ (13), మదన్‌కుమార్ అలియాస్ బన్నీ(11), సృజన్ (13), శిల్ప(14) మరణించారు.

మధూకర్(ఫైల్ ఫొటో)
ప్రమాదాన్ని గుర్తించిన గట్టుమీద ఉన్న ముగ్గురు విద్యార్థులు కేకలు వేస్తూ ఇంటికి పరుగులు తీశారు. జరిగిన విషయం తెలుసుకున్న స్థానికులు నలుగురు విద్యార్థుల మృతదేహాలను వెలికి తీశారు.

శిల్పా
మృతుల్లో మదన్‌కుమార్, సృజన్ సోదరులు కాగా.. శిల్ప, శివకుమార్ అక్కా తమ్ముడు. రెండు కుటుంబాలకు చెందిన నలుగురు మరణించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శివకుమార్
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మహమ్మద్ గూడలో గణేశ నిమజ్జనంలో పాల్గొన్న చిన్నారులకు చెరువులో ఈత కొట్టాలని కోరిక పుట్టింది. దీంతో ఏడుగురు చిన్నారులు నిమజ్జనం చేసిన చెరువులో ఈదేందుకు దిగారు. వీరిలో నలుగురు చిన్నారులు మృతి చెందగా మరో ముగ్గురిని గ్రామస్తులు కాపాడారు.

స్రుజన్
చిన్నారులను శిల్పా(14) సృజన్(13) అక్కడి ప్రాంతానికే చెందిన సుశీల కుమారులు నాని(10) శివ(12)గా గుర్తించారు.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications