నారాయణపేటలో ఘోర రోడ్డు ప్రమాదం... కారు బోల్తా... నలుగురు అక్కడికక్కడే మృతి...
నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామ శివారులో ఓ కారు బోల్తా కొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇందులో ముగ్గురు మహిళలు ఉన్నారు. ప్రమాదంలో మరొకరు గాయపడగా... ఓ చిన్నారి సురక్షితంగా బయటపడింది. బోల్తా కొట్టిన కారు హైదరాబాద్ నుంచి రాయచూర్ వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిమిత్తం మక్తల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కారు బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు మహిళలతో సహా ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాద కారణాలు తెలియాల్సి ఉంది.

ఇటీవలి కాలంలో తెలంగాణలో వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల 6న రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
రెండు రోజుల క్రితం నిజామాబాద్‌లోని భీంగల్‌లో అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు బైక్‌ను ఢీకొట్టి హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. రెండు రోజుల క్రితం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఓ లారీ బైక్‌ను ఢీకొనడంతో మహిళ తీవ్రంగా గాయపడింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications