వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నలుగురు తాగుబోతులు..? సెకండ్ హ్యాండ్, అంత లేదు: ధర్మపురి అర్వింద్

|
Google Oneindia TeluguNews

మొయినాబాద్ ఫామ్‌హౌస్ ఇన్సిడెంట్‌పై రాజకీయ దుమారం చెలరేగింది. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. టీఆర్ఎస్ పార్టీపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఫైరయ్యారు. ఎమ్మెల్యేలు, సీఎం కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేశారు. వారికి అంతా మార్కెట్ లేదని కామెంట్ చేశారు.

ఎమ్మెల్యేల ఇష్యూ కామెడీ సీన్ మాదిరిగా ఉందని అర్వింద్ అన్నారు. అదంతా డ్రామాయేనని పేర్కొన్నారు. ఆ నలుగురికి అంతా సీన్ లేదని చెప్పారు. వారంతా సెకండ్ హ్యాండ్ ఎమ్మెల్యేలని.. వాళ్లకు అంత రేటు ఉంటుందా? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఒక్కరూ గెలిచే వాళ్ళు కాదన్నారు. నిన్నటి డ్రామాను ప్రజలు చూసి కాసేపు నవ్వుకున్నారని కామెంట్ చేశారు.

 four mlas are drunkers, second hand:arvind

నలుగురు తాగుబోతులను పెట్టి ప్రగతి భవన్ నుంచి డైరెక్షన్ ఇచ్చారని ధర్మపురి అరవింద్ ఆరోపించారు. దేశ వ్యాప్తంగా ఇచ్చిన తీర్పు మునుగోడులో వస్తోందని తెలిపారు. దక్షిణ తెలంగాణలో బీజేపీ విజృంభిస్తోందని.. అదీ చూసి కేసీఆర్‌కు నిద్ర పట్టడం లేదన్నారు. దేశంలో ఎక్కడా సిట్టింగ్ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ తీసుకోలేదని గుర్తుచేశారు. మరీ అదే ఫార్మూలాను టీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఫాలొ కావడం లేదని అడిగారు.

బీజేపీలోకి వచ్చే ఎమ్మెల్యేలు పదవీకి రాజీనామా చేసి వస్తారని వివరించారు. సదరు నేత గెలుస్తారనే నమ్మకం ఉంటేనే పార్టీలోకి తీసుకుంటామని ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. పదవీ ఉండగానే.. పార్టీలోకి తీసుకోబోమని వివరించారు. తమ పార్టీ సిద్దాంతాల మేరకు పనిచేస్తోందని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి అవేమీ లేవని.. అందుకే కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎల్పీని విలీనం చేసి.. 12 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుందని గుర్తుచేశారు.

English summary
four mlas are drunkers, they are second hand bjp mp dharmapuri arvind alleges
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X