Heart Attack: గుండె పోటుతో నాలుగేళ్ల చిన్నారి మృతి.!
చిన్న పిల్లల్లో గుండె పోటు మరణాలు వణికిస్తున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా గుండె పోటు మరణాలు సంభవించడంతో భయపడిపోతున్నారు. బుడి బుడి అడుగులు వేసే వయస్సులో కూడా గుండె ఆగిపోవడం విస్మయానికి గురి చేస్తోంది. తాజాగా ఖమ్మం జిల్లాలో నాలుగేళ్ల చిన్నారికి గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఖమ్మం జిల్లా రూరల్ మండలం ఎం.వెంకటాయపాలెం గ్రామానికి చెందిన కుర్రా వినోద్,లావణ్య దంపతుల కూతురు నాలుగేళ్ల హర్షిత ఉంది. నవంబర్ 18న సాయంత్రం సమయంలో ఇంటి ఆవరణలో ఆడుకుంటుంది. ఆడుకుంటూ ఒకేసారి చాతిలో నొప్పి అంటూ కింద పడిపోయింది.
కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే హర్షిత చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఆమె గుండె పోటుతోనే మరణించినట్లు డాక్టర్లు చెప్పారని స్థానికులు పేర్కొన్నారు. నాలుగేళ్ల చిన్నారి గుండె పోటుతో మరణించడం ఏమిటనీ అందురూ ఆందోళన చెందుతున్నారు. వారం రోజుల క్రితం 12 సంవత్సరాల చిన్నారి గుండె పోటుతో మృతి చెందింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పద్మానగర్ కాలనీలో శ్రీనివాస్, రమ్య దంపతుల కుమార్తె కస్తూరి నివృత్తి ఉంది.

ఇంట్లో ఆడుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలింది. కుటుంబ సభ్యులు ఆమెను చెన్నూర్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే బాలిక చనిపోయిందని వైద్యులు తెలిపారు. నివృత్తి చెన్నూరులోని ఒక ప్రైవేట్ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. కార్తీక మాసం పౌర్ణమిని పురస్కరించుకుని వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్న ఆమె తల్లిదండ్రులు ఊహించని ఘటనతో గుండెలు అవిసేలా ఏడుస్తున్నారు.
10 రోజుల క్రితం కేపీహెచ్బీలో ఓ యువకుడు గుండెపోటుతో చనిపోయాడు. హనుమాన్ గుడిలో ప్రదక్షిణలు చేస్తూ కుప్పకూలిపోయాడు. ఇందకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగిత్యాల జిల్లా కమ్మరిపేట గ్రామానికి చెందిన 23 ఏళ్ల సంజీవ్ అనే యువకుడు గుండె పోటుతో చనిపోయాడు. మేనమామ కొడుకు పెళ్లికి మోత్కూరావుపేట వెళ్లిన అతను బరాత్ లో డ్యాన్స్ చేస్తూ గుండెలో నొప్పి అంటూ కింద పడిపోయాడు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించినా.. ఫలితం లేకపోయింది. అతను చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications