తెలంగాణకు గుడ్ న్యూస్ - సీఎం కేసీఆర్ కు లేఖ..!!

తెలంగాణలో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. ఫాక్స్‌కాన్‌ తెలంగాణలోనే ఏర్పాటు కానుంది.

తెలంగాణలో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. ఫాక్స్‌కాన్‌ తెలంగాణలోనే ఏర్పాటు కానుంది. ఈ మేరకు ఫాక్స్‌కాన్ చైర్మెన్ యంగ్ లియూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాసారు. మార్చి 2వ తేదీన చ‌ర్చించిన‌ట్లే.. కొంగ‌ర క‌లాన్‌లో ఫాక్స్‌కాన్‌ను ఏర్పాటు చేసేందుకు తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని చైర్మెన్ లియూ త‌న లేఖ‌లో తెలిపారు. ఆ భేటీ సమయంలో జరిగిన నిర్ణయం తో తెలంగాణలో ఫాక్స్‌కాన్ కంపెనీ ఏర్పాటు కానున్నట్లు వెల్లడించారు. అయితే, ఆ తరువాత అనేక రకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పుడు వీటికి ముగింపు చెబుతూ తెలంగాణలోనే తమ సంస్థ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని చైర్మెన్ లియూ స్పష్టత ఇచ్చారు.

ఫాక్స్‌కాన్ చైర్మెన్ యంగ్ లియూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాసిన లేఖలో పలు అంశాలు ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి, ఆయ‌న విజ‌న్‌ త‌న‌కు ఎంతో ప్రేర‌ణ ఇచ్చింద‌ని పేర్కొన్నారు. హైద‌రాబాద్‌లో త‌మ టీమ్ విజిట్ చేసిన‌ప్పుడు తెలంగాణ ప్ర‌భుత్వం ఇచ్చిన ఆతిథ్యానికి ఆయ‌న థ్యాంక్స్ తెలిపారు. హైద‌రాబాద్‌లో బ‌స చేసిన స‌మ‌యం అద్భుతంగా సాగింద‌న్నారు. వ్య‌క్తిగ‌తంగా సీఎం కేసీఆర్‌ను తైవాన్‌ కు ఆహ్వానిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. తైపి లో ఆతిథ్య స‌త్కారాల‌ను అందుకోవాల‌ని త‌న లేఖ‌లో సీఎం కేసీఆర్‌ను ఆయ‌న కోరారు. తెలంగాణలో సంస్థ ఏర్పాటు కోసం ప్రభుత్వ టీం సహకారం అవసరమని లియూ లేఖలో పేర్కొన్నారు.

Foxconn Chairman Young LiU lettr to CM KCR, saying that the manufacturing giant is committed to setting up the plant in the state

కొంగ‌ర‌క‌లాన్‌లో ఏర్పాటు చేయ‌నున్న ఫాక్స్‌కాన్‌ ద్వారా ల‌క్ష ఉద్యోగాలు క‌ల్పించ‌నున్న‌ట్లు ఆ కంపెనీ వెల్లడించింది. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్‌లో రూ.3500 కోట్ల పెట్టుబడితో ఫాక్స్‌కాన్‌ ఎలక్ట్రానిక్‌ కంపెనీని నెలకొల్పేందుకు అంగీకారం జరిగింది. తైవాన్ కు చెందిన ఈ కంపెనీకి 250 ఎకరాలు అవసరం కాగా.. ఇప్పటికే సర్వే నం.300లో 187 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వ కేటాయించింది. ఇందుకుగాను రెవెన్యూ అధికారులు, టీఎస్‌ఐఐసీ అధికారులు రెండు మూడు నెలలుగా సర్వే చేసి భూమిని సిద్ధంగా ఉంచారు. మిగతా భూమిని త్వరలోనే సేకరిస్తామని తెలిపారు. దీంతో..ఈ కంపెనీ ఏర్పాటు పైన కొనసాగుతున్న సస్పెన్స్ కు తెర పడింది. తెలంగాణలోనే ఫాక్స్‌కాన్‌ ఏర్పాటు కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+