ఫాక్స్‌కాన్ మరో భారీ పెట్టుబడి: ఇది ‘తెలంగాణ స్పీడ్’ అంటూ కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా, తైవాన్‌కు చెందిన పాక్స్‌కాన్(Foxconn) సంస్థ తెలంగాణలో మరో 400 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ఫాక్స్‌కాన్ భారత ప్రతినిధి వీ లీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కాగా, గతంలో కుదుర్చుకున్న 150 మిలియన్ డాలర్ల ఒప్పందానికి ఇది అదనం. దీంతో ఆ సంస్థ మొత్తం 550 మిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనుంది.
ఫాక్స్‌కాన్ తాజా నిర్ణయంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రముఖ సర్వీస్ ప్రొడైవర్ సంస్థ ఫాక్స్‌కాన్‌తో తమకు దృఢమైన బంధానికి నిదర్శనమని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇరువురి మధ్య పరస్పర అవగాహన కొనసాగుతోందని తెలిపారు. తెలంగాణలో ఫాక్స్‌కాన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటోందన్నారు.

తెలంగాణ స్పీడ్‌కు ఇది మరో నిదర్శనమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ పెట్టుబడులు తెలంగాణ అభివృద్ధిని రుజువు చేస్తున్నాయని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, ఫాక్స్‌కాన్‌తో ఇది వరకే తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో ఎలక్ట్రానిక్స్ మానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటుకు ఈ ఏడాది మేలో శంకుస్థాపన జరిగింది.
Our friendship with Foxconn Group remains steadfast, each of us delivering on mutual commitments
— KTR (@KTRBRS) August 12, 2023
With total infusement of 0m (adding previous 0m), FIT is poised to deliver on its promises in Telangana
This once again proves Telangana Speed pic.twitter.com/DOssnhmyRo
ఈ యూనిట్‌లో రూ.1,656 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది ఫాక్స్ కాన్. ఈ నిర్మాణ పనులకు మే 15న కేటీఆర్ భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే. ప్రతిపాదిత ప్లాంట్ ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ ఇంటర్ కనెక్ట్ టెక్నాలజీ కార్యకలాపాల తెలంగాణలోని కార్యకలాపాలకు కేంద్రంగా పనిచేయడంతోపాటు సంస్థ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించేందుకు వీలు కల్పిస్తుందని ఫాక్స్‌కాన్ పేర్కొంది. ఫాక్స్‌కాన్ పెట్టుబడి ద్వారా 25 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని గతంలో కేటీఆర్ తెలిపారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications