పథకాల పేరుతో పచ్చి మోసం..! గేదెలకు భీమా మాటున అధికారుల చేతి వాటం..!!
హైదరాబాద్: ప్రభుత్వ పథకాలు అవినీతి మయం అవుతున్నాయి. ఉన్నత ఆశయంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రవేశ పెట్టిన పథకాలు నీరుగారి పోతున్నాయి.ఆఖరి మూగ జావాలన మాటున కూడా అవినీతి చేస్తున్నారు అదికారులు. బర్రె చనిపోవడంతో అధికారుల అవినీతి బయటపడిన ఘటన కామారెడ్డి జిల్లాల్లో జరిగింది. వివరాల్లోకి వెలితే... కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎంఎస్‌కేవై ద్వారా వ్యవసాయ శాఖ అధికారులు కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పెద్దగుల్లా గ్రామానికి చెందిన 22 మంది రైతులకు ఒక్కొక్కరికి రెండు చొప్పున 44 గేదెలను అందజేశారు.
ఒక్కోదాని ధర 80 వేల రూపాయాలు. 50 శాతం రాయితీ ఉండటంతో రైతులు 40 వేల రూపాయల చొప్పున చెల్లించారు. గేదె చనిపోతే భీమా వస్తుందంటూ అధికారులు ఒక్కో రైతు వద్ద 6 వేలరూపాయలు వసూలు చేశారు. భీమా చేసినట్లు రెండు గేదెల చెవులకు పోగులు వేశారు.ఇటీవల పెద్దగుల్లా గ్రామానికే చెందిన రైతు వెంకట్‌కు చెందిన గేదె మృతి చెందింది. భీమా ఉందని, సొమ్ము వస్తుందని బాన్సువాడలోని కార్యాలయానికి వెళ్లగా అసలు విషయం బయటపడింది.

మృతి చెందిన ఆ గేదెకు వ్యవసాయాధికారులు భీమా చేయించలేదని చెప్పడంతో రైతు అవాక్కయ్యారు. ఇలా ఆ అధికారుల అవినీతి భయటపడింది. అసలు కథ భయటకొచ్చింది. రెండు గేదెలకు భీమా చేశామని చెప్పి ఒక గేదెకు మాత్రమే భీమా చేశారు. దీంతో రైతులు ఆందోలనకు దిగారు. వ్యవసాయ అధికారులు తమ దగ్గర డబ్బులు వసూళ్లు చేసి మోసం చేశారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications