Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చొక్కా విప్పి, ఎగిరి తన్నాడు: హీరో ఉదయ్ కిరణ్ సిసి ఫుటేజ్ విడుదల

హైదరాబాద్: హోటల్‌ దసపల్లాలోని పబ్‌పై బుధవారం దాడి చేసిన 'ఫ్రెండ్స్‌ బుక్‌' హీరో ఉదయ్ కిరణ్‌ను అరెస్టు చేసిన పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. ఉదయ్ కిరణ్ పబ్‌లో ప్రవర్తించిన తీరుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు విడుదల చేశారు.

నాకే లోపలికి అనుమతివ్వవా, నా ప్రొడక్షన్‌ సభ్యులంతా ఇక్కడే ఉన్నారని, నన్ను అవమానిస్తావా అంటూ ఉదయ్ కిరణ్‌ చేసిన హంగామాతో కూడిన సీసీ ఫుటేజీని శనివారం జూబ్లీహిల్స్‌ పోలీసులు విడుదల చేశారు. దీంట్లో బుధవారం రాత్రి పబ్‌కు వెళ్లిన ఉదయ్ కిరణ్‌ చొక్కా విప్పి హడావుడి చేసినట్లుగా ఉంది.

Uday Kiran

తలుపులను బలంగా తన్నడం. సీసీ కెమెరాను లాగే ప్రయత్నం చేయడం వంటివి ఉన్నాయి. అక్కడున్న వారు అడ్డగించే ప్రయత్నం చేస్తే ఎగిరెగిరి కాలితో తన్నాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించగా నానా హంగామా సృష్టించాడని పోలీసులు చెప్పారు. మరోవైపు, తన పైన వచ్చిన ఆరోపణలను ఉదయ్ కిరణ్ కొట్టిపారేశాడు.

కాగా, హోటల్‌ దసపల్లాలోని పబ్‌పై బుధవారం దాడి చేసిన 'ఫ్రెండ్స్‌ బుక్‌' హీరో ఉదయ్ కిరణ్‌ను అరెస్టు చేసిన పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. పబ్‌లో జరిగిన గొడవలో కార్ల అద్దాలు ధ్వంసం చేయగా నిర్వాహకులు అతనిపై జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషనులో కేసు నమోదు చేశారు.

శనివారం సాయత్రమే నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా పోలీసు స్టేషన్‌లోనూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటనల నేపథ్యంలో అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఉదయ్ కిరణ్‌ గతంలో చేసిన వివిధ మోసాలపై మరింత లోతుగా విచారణ చేపట్టేందుకు తాము కస్టడీకీ కోరుతామని జూబ్లీహిల్స్‌ ఇన్స్‌పెక్టర్‌ వెంకట రెడ్డి తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+