వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శిరీష దుస్తులపై మరకలు: పోలీసుల వద్ద ఫోరెన్సిక్ రిపోర్టు.. ఏం తేలింది?

శిరీష దుస్తులపై ఉన్న మరకలు ఆహార పదార్థాలకు సంబంధించనవేనని రిపోర్టులో తేలింది. దీంతో శిరీషపై అత్యాచారం జరగలేదని మరోసారి నిర్దారించినట్లయింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బ్యుటీషియన్ శిరీష అనుమానస్పద మృతి చోటు చేసుకుని దాదాపు నెల రోజులు కావస్తున్నా.. ఆమె ఆత్మహత్య చుట్టూ ఇంకా ఏదో మిస్టరీ కదలాడినట్లుగానే కనిపిస్తోంది. శిరీష ఆత్మహత్యపై పోలీసులు ఇస్తున్న వివరణకు ఆమె కుటుంబ సభ్యులు ఎంతకీ సంతృప్తి చెందడం లేదు.

చివరకు పోలీసులే దగ్గరుండి మరీ శిరీష కుటుంబ సభ్యుల అనుమానాలను నివృత్తి చేసే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే శిరీష కుటుంబ సభ్యులు ఆమెపై అత్యాచారం జరిగిందని చేసిన ఆరోపణలకు స్పష్టతనిచ్చారు. శిరీష దుస్తులపై మరకలు ఈ ఆరోపణలకు ఊతమివ్వడంతో.. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి పరీక్షలు జరిపించారు.

<strong>భరించలేకపోయా, నీకు పెళ్లైందిగా అని చెప్పా: శిరీష పేరెంట్స్‌తో తేజస్విని, జాబ్ మానేయమని హెచ్చరిక</strong>భరించలేకపోయా, నీకు పెళ్లైందిగా అని చెప్పా: శిరీష పేరెంట్స్‌తో తేజస్విని, జాబ్ మానేయమని హెచ్చరిక

రిపోర్టులో తేలిందేంటంటే?:

రిపోర్టులో తేలిందేంటంటే?:

తాజాగా బంజారాహిల్స్ పోలీసులకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు అందింది. శిరీష దుస్తులపై ఉన్న మరకలు ఆహార పదార్థాలకు సంబంధించనవేనని రిపోర్టులో తేలింది. దీంతో శిరీషపై అత్యాచారం జరగలేదని మరోసారి నిర్దారించినట్లయింది. అంతకుముందు ఎఫ్ఎస్ఎల్ ప్రాథమిక రిపోర్టులోను ఇదే విషయం స్పష్టమైన సంగతి తెలిసిందే. శిరీష శరీరంలో దానికి సంబంధించిన ఆనవాళ్లేమి కనపడలేదని అందులో తేలింది.

Recommended Video

Beautician Sirisha Case Mystery Revealed
లొకేషన్ పై గందరగోళం:

లొకేషన్ పై గందరగోళం:

అనుమానాలను నివృత్తి చేసే క్రమంలో శిరీష కుటుంబ సభ్యులను పోలీసులు కుకునూర్ పల్లి తీసుకెళ్లారు. శిరీష తన భర్తకు షేర్ చేసిన వాట్సాప్ లొకేషన్ పోలీస్‌స్టేషన్‌కు 2కి.మీ ముందు ఉన్న హనుమాన్ ఆలయానికి వెనుక ఉన్న చెట్ల పొదల్లో చూపిస్తున్నట్లు కుటుంబ సభ్యులు వాదించినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం ఆ లొకేషన్ పోలీస్ క్వార్టర్స్ దే అని నచ్చజెప్పినట్లు సమాచారం. దీంతో శిరీష కుటుంబ సభ్యులు అసంతృప్తితోనే ఉన్నట్లు చెబుతున్నారు.

ఆరోజు శిరీష చివరి మెసేజ్ లు ఇలా:

ఆరోజు శిరీష చివరి మెసేజ్ లు ఇలా:

'రాజీవ్ వెళ్లకు. నాకు దూరం అవ్వకు ప్లీజ్.. రాజీవ్ ప్లీజ్ వాళ్లు నిన్ను ఎంత ఇబ్బంది పెట్టినా వెళ్లకు ప్లీజ్..' ఇదీ శిరీష తాను కుకునూర్ పల్లి వెళ్లిన తర్వాత రాజీవ్ కు పంపిన చివరి మెసేజ్. ఇలా చాలా మెసేజ్ లతో అతన్ని ఆమె బతిమాలుకుంది. తనకేదో తేడా కొడుతోందని, దయచేసిన తనను ఒంటరిగా వదిలి వెళ్లవద్దని అతన్ని ప్రాధేయపడింది.

తేజస్విని ఎంట్రీతో:

తేజస్విని ఎంట్రీతో:

మరోవైపు తేజస్విని పోలీసుల ఎదుట హాజరై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. రాజీవ్ ను తాను వివాహం చేసుకోవాలనుకున్నా.. శిరీష అతన్ని విడిచిపెట్టకపోవడం వల్లే తమ మధ్య గొడవ జరిగినట్లు తేజస్విని వివరించింది. పెళ్లయిన మహిళకు ఇలాంటి వ్యవహారమేంటని శిరీషను నిలదీసినా.. ఆమెలో మార్పు రాకపోవడంతోనే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని ఆమె తెలిపారు.

English summary
FSL Report was cleared that stains on Sirisha's dress are belongs to some food. Report clears no rape act happened on her
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X